కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక విధ్వంసం..

పార్లమెంట్ సాక్షిగా తేలిన చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు

నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ డేటాతో బయటపడ్డ వాస్తవాలు

చంద్రబాబుది పచ్చి మోసం, ఒట్టి ప్రచార ఆర్భాటం మాత్రమే

తేల్చి చెప్పిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీర శేఖర్ రెడ్డి 

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ 
రెడ్డి.

నెలకు లక్ష కోట్ల పెట్టుబడులు పచ్చి బూటకం..

కూటమి 2ఏళ్లలో వచ్చింది కేవలం రూ. 6,962 కోట్లే..

వైయస్. జగన్ పాలనలోనే రూ. 1.15 లక్షల కోట్ల పెట్టుబడులు: 

వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్

కూటమి పాలనలో 8వ స్థానానికి పతనం

కనీసం కూటమి హాయంలో ఎంఎస్ఎంఈలు, ఉద్యోగాల పై కేంద్రానికీ లేని సమాచారం.

ఆధారాలతో సహా బయటపెట్టిన వీరశేఖర్ రెడ్డి

1.15 లక్షల కోట్లు తెచ్చిన జగన్ గారు విధ్వంసకారుడా?

రూ. 32 వేల కోట్లు తెచ్చిన చంద్రబాబు విజనరీనా?

సూటిగా ప్రశ్నించిన వీరశేఖర్ రెడ్డి. 

తాడేపల్లి: ఏపీలో నెలకూ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ వస్తోందన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.. పార్లమెంటు సాక్షిగా ఒట్టి బూటకమన్న విషయం స్పష్టమైందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైయస్.జగన్ హయాంలో  ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి పాలనలో 8వ ర్యాంకుకు దిగజారిందని మండిపడ్డారు. కోవిడ్ లాంటి విపత్తులున్నా.. వైయస్.జగన్ హయాంలో రూ.1.15 లక్షల కోట్లు పెట్టుబడులు తేగా.. చంద్రబాబు గత రెండేళ్లలో కేవలం రూ.6,962 కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయని కేంద్రం వెల్లడించిన గణాంకాల సాక్షిగా వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిశ్రమలు తరలిపోతున్నాయని విష ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఎవరిది విధ్వంసమో? ఎవరిది అభివృద్ధో తేలిపోయిందన్నారు. తప్పుడు ప్రచారంపై ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఘోరంగా పడిపోయిన ర్యాంక్..

ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామికంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్తోందని చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఎల్లో మీడియాలో బ్యానర్ కథనాలు రాయించుకోవడం వారికి అలవాటుగా మారింది. కానీ, గతంలో వైఎస్. జగన్ ప్రభుత్వ హయాంలో దేశంలోనే 'నెంబర్ వన్' ప్లేస్‌లో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్, చంద్రబాబు గారి పాలనలో 8వ స్థానానికి పడిపోయింది. నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ ఇండెక్స్‌తోనే చంద్రబాబు, లోకేష్‌లు చేస్తున్న ప్రచార ఆర్భాటం పచ్చి అబద్దమని నేరుగా తేటతెల్లమైంది.

పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన కేంద్ర ప్రభుత్వ నిజాలు..

ఇటీవల లోక్‌సభ క్వశ్చన్ అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ గారు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డీపీఐఐటీ(DPIIT), ఇన్వెస్ట్ ఇండియా డేటా ప్రకారం.. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవంగా గ్రౌండ్ అయిన పరిశ్రమలు కేవలం 10 మాత్రమే. అందులోనూ కేవలం 2 పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. మిగిలిన 8 ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.

ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం గ్రౌండ్ చేసిన పెట్టుబడుల విలువ కేవలం రూ.6,962 కోట్లు మాత్రమే. కానీ రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గాలి మాటలు చెప్తున్నారు. కనీసం 20 లక్షలు కాదు కదా, 2 లక్షలు లేదా 2 వేల ఉద్యోగాలైనా ఇచ్చారా? కేంద్ర డేటా ప్రకారం కేవలం 22,167 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తే, అక్కడ ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు.

వైఎస్ జగన్ హయాం వర్సెస్ చంద్రబాబు పాలన: గణాంకాల పోలిక..

2019-24 మధ్య వైఎస్ జగన్ గారి హయాంలో పరిశ్రమలు పారిపోయాయని తప్పుడు ప్రచారం చేశారు. కానీ డీపీఐఐటీ యాన్యువల్ రిపోర్ట్ (పేజ్ నెంబర్ 229) ప్రకారం, వైయస్.జగన్  5 ఏళ్ల పాలనలో రూ. 1,15,000 కోట్లకు పైగా పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి.
2019:   73 ప్రాజెక్టులు –        రూ. 34,696 కోట్లు
2020:  (కోవిడ్ సమయం):  రూ. 9,840 కోట్లు
2021:                                   రూ. 10,350 కోట్లు
2023:                                    రూ. 10,536 కోట్లు
2024:                                  రూ. 12,708 కోట్లు.

కోవిడ్ లాంటి సంక్షోభంలోనూ వైయస్. జగన్ ఒక్క ఏడాదిలో గ్రౌండ్ చేసిన పెట్టుబడుల కంటే, ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సాధించింది చాలా తక్కువ. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దావోస్, సిఐఐ సమ్మిట్లు అంటూ ఆర్భాటం చేసి 5 ఏళ్లలో గ్రౌండ్ చేసింది కేవలం రూ. 32,803 కోట్లు మాత్రమే. మరి రూ. 1.15 లక్షల కోట్లు తెచ్చిన జగన్ గారు విధ్వంసకారుడా? రూ. 32 వేల కోట్లు తెచ్చిన చంద్రబాబు విజనరీనా?

ఎంఎస్ ఎం ఈ రంగం ఘోర పతనం – డేటా లేదన్న కేంద్రం.. 

ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన సమాధానం మరింత షాకింగ్‌గా ఉంది. 2024-25, 2025-26లలో వేలాది మందికి శిక్షణ ఇచ్చామని, కానీ ఎంతమంది పరిశ్రమలు పెట్టారు, ఎంతమందికి ఉపాధి వచ్చిందనే దానికి కేంద్రం వద్ద 'నో డేటా అవైలబుల్' అని సమాధానం ఇచ్చింది. అంటే ఎంఎస్ఎంఈ రంగాన్ని ఘోరంగా పతనం చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సొంత రాష్ట్ర ప్రభుత్వ సోషియో ఎకానమిక్ సర్వే (పేజ్ నెంబర్ 379) ప్రకారం.. 2019 నుంచి 2024 మధ్య కోవిడ్ ఉన్నప్పటికీ 4,77,062  ఎంఎస్ ఎంఈ యూనిట్లు  స్థాపించబడ్డాయి. వీటి ద్వారా 32,79,770 మందికి ఉపాధి లభించిందని సాక్షాత్తు చంద్రబాబు ప్రభుత్వమే స్టాంప్ గుద్ది రికార్డుల్లో పేర్కొంది. మరి నాడేమీ పరిశ్రమలు రాలేదని తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, లోకేష్ ప్రజలకు, వైఎస్సార్‌సీపీకి క్షమాపణ చెప్పాలి.

రాష్ట్రం అప్పుల పాలు.. క్రైమ్‌లో టాప్!..

కేవలం 24 నెలల్లో  రూ. 3.60 లక్షల కోట్లు అప్పులు దాటించేసిన రాష్ట్ర ప్రభుత్వం పాలనలో జీఎస్టీ వసూల్లు మాత్రం డమాళ్ అయ్యాయని మండిపడ్డారు. మరోవైపు  క్రైమ్ రేటు, దోపిడీ, అవినీతి, అక్రమాలు, మహిళలపై అగాయిత్యాల్లో మాత్రం రాష్ట్రం టాప్‌లో ఉందన్న ఆయన.. పారిశ్రామిక పర్ఫార్మెన్స్‌లో మాత్రం తీవ్రంగా విఫలమయిందని ఎద్దేవా చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రులు దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా, కొరియా తిరగడం తప్ప సాధించింది శూన్యమని... సొంత కంపెనీ హెరిటేజ్, సొంత ఎమ్మెల్యేలు, అనుకూల సంస్థలకు అడ్డగోలుగా భూములు, ఇన్సెంటివ్‌లు కట్టబెట్టడం తప్ప కొత్త పరిశ్రమలు తెచ్చింది లేదని తేల్చి చెప్పారు. వైఎస్.జగన్ పై  చేసిన తప్పుడు ప్రచారాన్ని, కూటమి ప్రభుత్వ నిజమైన పారిశ్రామిక విధ్వంసాన్ని ప్రజలు, మేధావులు, మీడియా గమనించి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

Back to Top