రామచంద్రపురంలో గడపగడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమం 

 ప్రజల సమస్యలు తెలుసుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి సూర్యప్రకాశ్ 

 రామచంద్రపురం: రామచంద్రపురం టౌన్‌లోని కమ్మవారి సావరంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన  గడపగడపకు వైయ‌స్ఆర్  కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు  పిల్లి సుభాష్ చంద్రబోస్ , డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు, రామచంద్రపురం వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత పరిస్థితుల మధ్య ప్రజలు గమనిస్తున్న మార్పులపై చర్చిస్తూ ప్రతి కుటుంబంతో మమేకమయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top