భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయ‌డం దుర్మార్గం 

నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఎమ్మెల్యే విరుపాక్షి డిమాండ్‌

క‌ర్నూలు:  ఆలూరు నియోజకవర్గం మణేకుర్తి గ్రామంలో కురువల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్ర‌హాన్ని దుండ‌గులు ధ్వంసం చేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. ఇటీవ‌ల‌ ప‌గిలిపోయిన విగ్ర‌హాన్ని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, పార్టీ నాయ‌కులు ప‌రిశీలించారు. విగ్ర‌హ మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.20 వేల న‌గ‌దును గ్రామ పెద్ద‌ల‌కు ఎమ్మెల్యే అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  మణేకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం పగలకొట్టడం దుర్మార్గ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అనవసరంగా గొడవలు సృష్టించకండి అంటూ హిత‌వు ప‌లికారు.  ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలే త‌ప్ప‌..ఇలా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌డం స‌రికాద‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అల్ల‌రి మూక‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఎస్పీని కోరారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Back to Top