తిరుపతి: కొంత కాలంగా టీటీడీ పాలక మండలికి, కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిన వైయస్ఆర్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని, ఆయన అక్రమ అరెస్టుతో మా నోళ్లు మూయించలేరని వైయస్ఆర్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. `టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందని, కొంత మంది కాంట్రాక్టర్లతో అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇప్పించుకున్న విజిలెన్స్ అధికారులు మా నాయకుడు కరుణాకరరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్ట్‌లు, జైళ్లతో ఉద్యమాలకు మారుపేరైన కరుణాకరరెడ్డిని , అలాగే తిరుపతి నియోజకవర్గ, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల నోళ్లు మూయించాలని అనుకోవడం అవివేకం. ఇలాంటి వాటికి భయపడే నైజం భూమన కరుణాకర్‌రెడ్డి ది కానేకాదు. కూటమి పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి, కట్టుకథలతో , అక్రమ కేసుతో మా నాయకుడి అరెస్ట్‌కు సిద్ధమైన టీటీడీ విజిలెన్స్ ...మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయి. అయితే జైలు నుంచి ఇంతకు వందింతలు శక్తితో మా నాయకుడు కరుణాకరరెడ్డి తిరిగి వస్తారు. అప్పుడు మరింత బలంగా, శక్తిమంతంగా టీటీడీలో ప్రస్తుత పాలకులు చేస్తున్న తప్పుల్ని, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని కరుణాకరరెడ్డి నాయకత్వంలో తిప్పి కొడతాం. దేశంలో ఎమెర్జెన్సీని వ్యతిరేకిస్తూ అత్యంత చిన్న వయసులోనే జైలును ముద్దాడిన పోరాట పటిమ, స్ఫూర్తి భూమన కరుణాకరరెడ్డి ది. అలాంటి నాయకుడిపై టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాల సాకుతో అరెస్ట్ చేయాలని అనుకోవడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం లాంటిదే. ఇలాంటి వాటికి భూమన , వైయస్ఆర్‌సీపీ అభిమానులెవరూ భయపడకపోగా, మరింత శక్తిని కూడగట్టుకుని ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతాం` అంటూ భూమన అభినయ్‌రెడ్డి హెచ్చరించారు.