మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై మండ‌లిలో నిర‌స‌న‌

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో నిరసన తెలిపారు. గత వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వంలో వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో 17 నూతన ప్రభుత్వ మెడికల్  కళాశాలలను తీసుకొస్తే .. కూటమి ప్రభుత్వంలో  చంద్రబాబు నాయుడు  వాటన్నింటినీ  ప్రైవేటుపరం చేస్తూ.. తీసుకున్న నిర్ణయాన్ని.. వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తూ..  ఏపీ శాసనమండలి సమావేశాల రెండో రోజు మండలి ఆవరణలో శాసనమండలి ప్రతిపక్ష నేత  ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్సీలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని నిన‌దించారు.  శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను అడ్డుకోవడం దుర్మార్గమని, కూటమి ప్రభుత్వ నిరంకుశ  పాలనకు ఇది నిదర్శనమని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకే మెడికల్ కళాశాలలను చంద్రబాబునాయుడు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నాడని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top