మెడికల్ కాలేజీల అమ్మకంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

దానిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు మళ్ళీ లిక్కర్ స్కాం సోదాలు

అనీల్‌ రెడ్డి కంపెనీల్లో తనిఖీలంటూ హంగామా

వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి

రాష్ట్రంలో రైతుల గోడు పట్టని కూటమి సర్కార్

యూరియా కొరత, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ పాలన

మద్యం పాలసీతో భారీ అవినీతికి తెగబడ్డ ప్రభుత్వం

అడుగడుగునా బెల్ట్‌షాప్‌లు, ఏరులై పారుతున్న మద్యం

మండిపడ్డ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు బయటపడిన ప్రతి సందర్బంలోనూ సీఎం చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్‌ను బయటకు తీస్తుంటారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, డైవర్షన్‌లో భాగంగా అనిల్‌రెడ్డి కంపెనీల్లో లిక్కర్ స్కాంలో సిట్ సోదాలు అంటూ హంగామాను ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఒకవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, మరోవైపు కనీసం యూరియాను సైతం అందించలేని చేతకానితనం, తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో అవినీతి దందాలతో ప్రభుత్వ ప్రతిష్ట అథాపాతాళానికి పడిపోయిందని అన్నారు. తన అసమర్థపాలనను కప్పిపుచ్చుకుంటూ, వైయస్ఆర్‌సీపీపై బుదరచల్లేందుకు ఎల్లో మీడియా సహకారంతో తమకు అలవాటైన కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

రాష్ట్రంలో రైతుల పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పెట్టుబడిసాయం కింద అందించే అన్నదాత సుభీభవను తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక విద్యార్ధుల పరిస్థితి చూస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, పరీక్షలు ఉత్తీర్ణులు అయిన విద్యార్ధులకు కాలేజీ యాజమాన్యాలు వారి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.  అలాగే ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న వారికి కొన్ని యాజమాన్యాలు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టికి మళ్ళించేందుకు చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా నిత్యం బురదచల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఏ రకంగా వైయస్ జగన్‌పై విషం చిమ్మాలా అనేదే ఈ ఎల్లోమీడియా లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ రోజు ఈనాడు పత్రికలో లిక్కర్ స్కాంలో వైయస్ జగన్ సన్నిహితుడు అనీల్‌రెడ్డి అంటూ పెద్ద కథనం రాశారు. ఇప్పటికే వైయస్ జగన్‌తో సన్నిహితంగా ఉండే రిటైర్డ్ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా అనేక మందిని అరెస్ట్ చేశారు. రూ.3 వేల కోట్ల స్కాం అంటున్నారు, కనీసం దీనిలో వంద కోట్ల వరకు అయినా పట్టుకోగలిగారా? ఇటీవలే ఎవరివో రూ.11 కోట్లు తీసుకువచ్చి, స్కాంకు సంబంధించిన డబ్బు ఇది అంటూ చెప్పేందుకు విఫలయత్నం చేశారు. రాజ్‌ కసిరెడ్డి దీనిపై న్యాయస్థానంలో అభ్యంతరం చెప్పి, పట్టుబడిన డబ్బును పరిశీలించేందుకు విడిగా ఉంచాలంటూ కోరారు. ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారో విచారించాలని కోరారు. కానీ సిట్ అధికారులు ఆ నోట్ల కట్టలను కూడా బ్యాంకుల్లో జమచేసి, ఆధారాలను పరిశీలించకుండా మాయ చేసేందుకు ప్రయత్నించారు. నిజాయితీ ఉంటే రాజ్ కసిరెడ్డి చేసిన డిమాండ్ మేరకు ఎందుకు మీరు పట్టుకున్న నోట్లను పరిశీలించే అవకాశం లేకుండా ఎందుకు చేశారో చెప్పాలి? 

లేని లిక్కర్ స్కాంను అడ్డంపెట్టుకుని కక్షసాధింపులు

ప్రభుత్వ అసమర్థత బయటపడినప్పుడల్లా లిక్కర్ స్కాం అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఈ రోజు పత్రికల్లో  అనీల్‌రెడ్డికి చెందిన రెండు కంపెనీల్లో గతంలో వైయస్ జగన్ సతీమణికి  వాటాలు ఉన్నాయంటూ రాశారు. ఇలాంటి తప్పుడు రాతలు రాసే ముందు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయరా? అయిదేళ్ళ పాటు సీఎం భార్యగా ఏనాడైనా ఆమె, ఏ వ్యవహారాల్లో అయినా జోక్యం చేసుకున్నారా? ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె ప్రమేయాన్ని చూపించారా? చాలా సామాన్యురాలిగా  భారతమ్మ జీవిస్తుంటారు. నిరాడంబరంగా తన జీవనశైలిని గడిపే వారి పైన ఇలా బుదరచల్లే కార్యక్రమం చేయడం దురదృష్టకరం. రాజకీయ కక్షసాధింపుల్లో కుటుంబసభ్యులను కూడా లాగడం దారుణం. 

కూటమి ప్రభుత్వంలోనే భారీగా లిక్కర్ అవినీతి 

గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,600 కోట్లకు పైగా లిక్కర్ స్కాంలో అవినీతి జరిగిందని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోయిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పదహారు నెలల్లో ఈ మేరకు గతంలో కోల్పోయిన ఆదాయాన్ని ఎంత ఆర్జించారో సీఎం చంద్రబాబు వెల్లడించాలి. కూటమి ప్రభుత్వం లైసెన్స్‌ ఫీజు రూ.1800 కోట్లు వసూలు చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల గత ప్రభుత్వం కంటే ఎంత ఎక్కువ ఆదాయాన్ని కూటమి ప్రభుత్వం ఆర్జించిందో చెప్పాలి. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం కనీసం రెండుమూడు శాతం కూడా లిక్కర్ ఆదాయం పెరగలేదు. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల వేళలను ఖచ్చితంగా అమలుచేశాం. ఎక్కువ రేటుకు మద్యం విక్రయించాం. మద్య నియంత్రణకు పూర్తి చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం మాత్రం అర్థరాత్రి వరకు మద్యం అమ్ముకునేందుకు వీలు కల్పించింది. పెద్ద ఎత్తున బెల్ట్ షాప్‌లను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతులు ఇవ్వలేదు. అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇచ్చారు. అలాంటప్పుడు ముడుపులు ఎవరు ఇస్తారు? చంద్రబాబు ప్రభుత్వంలోనే కొత్తగా డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారు. వారికి కావాల్సిన డిస్టిలరీలకే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో మద్యం బాటిళ్ళు ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తడ వరకు ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌షాప్‌లు నడుస్తున్నాయి. వైన్‌ షాప్‌ల టెండర్లలో మార్జిన్‌ను పెంచుతూ చంద్రబాబు ఇచ్చిన జీఓ వల్ల ప్రభుత్వానికి దాదాపు నాలుగైదు వేల కోట్ల మేర నష్టం వస్తోంది. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీకు రూ.4 వేల కోట్లు కేటాయించలేరా?

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా పేద విద్యార్ధులకు వైద్య విద్యను, పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో సీఎంగా వైయస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ఫీజులతోనే పేదలు వైద్య విద్యను పొందేందుకు వీలు కల్పించాలని ఆయన సంకల్పించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు తన స్వార్థం, తన బినామీలకు ఆదాయం కల్పించేందుకు ఆ ప్రైవేటు కాలేజీలను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు తెగబడ్డారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యకమవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి రూ.నాలుగువేల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు ప్రభుత్వం వద్ద లేదని చంద్రబాబు చెబుతున్నారు. ప్రైవేటు వారికి ఎకరానికి రూ.100 చొప్పున ఇస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వకుంటున్నారు. ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్న నాయకుడు వైయస్ జగన్. ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశారు. పేద విద్యార్ధులకు నాడు-నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం, ఆధునిక వసతి సదుపాయాలు కల్పించారు. అమ్మ ఒడి ద్వారా స్కూల్‌కు వెళ్ళే విద్యార్ధులను ప్రోత్సహించేందుకు తల్లుల ఖాతాలకు సొమ్ము జమ చేశారు. ఇటీవల అనంతపురంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయాలంటే కావాల్సినది రూ.90 వేల కోట్లు, కానీ ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే. దీనినే సూపర్ హిట్ అని ఎలా అంటున్నారో చంద్రబాబు చెప్పాలి. వేలాది మందిని సభకు తరలించి, వారి ముందు చంద్రబాబు అబద్దాలు చెప్పారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని తీసుకువచ్చాను అని చెప్పగలరా? 

ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలను ఏం సాధించారు?

కేంద్రంలో భాగస్వామిగా ఉండి, తరచూ ఢిల్లీకి వెళ్ళి వస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేరకు సాధించుకుంటూ వచ్చారో  రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. రాష్ట్రంలో యూరియా దొరికే పరిస్థితి లేదు. బ్లాక్‌లో మాత్రం యూరియా చక్కగా దొరుకుతోంది. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా యూరియాను తీసుకురాలేని అసమర్థ సీఎంగా చంద్రబాబు మిగిలిపోతున్నాడు. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ రాజకీయ కక్షసాధింపులు, పైరవీలకే పరిమితమవుతున్నారు. అంతేకానీ ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క ప్రయోజనాన్ని సాధించే కార్యక్రమం చేయడం లేదు. పోలవరం ఎత్తు తగ్గించారు. పోలవరంను ముందుగా నిర్ణయించిన ఎత్తు వరకు నిర్మించేలా కేంద్రంను ఒప్పించేందుకు ఎలాంటి ప్రయత్నం చేశారో చంద్రబాబు చెప్పగలరా? విశాఖ రైల్వే జోన్‌ పరిధిలో ఆదాయాన్ని వచ్చే రూట్‌లను మినహాయిస్తున్నారు, దానిని అడ్డుకునేందుకు ఏం చేశారు? విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం కాకుండా ఎలాంటి ఒత్తిడి తీసుకువస్తున్నారు?

Back to Top