రాయ‌చోటి ఘ‌ట‌న‌పై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం విచార‌కరం

తాడేప‌ల్లి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి, విచారం వ్య‌క్తం చేశారు.  శుక్రవారం రాత్రి వరదనీటిలో కొట్టుకుపోయి షేక్ ముని, ఇలియాస్, గణేష్, చిన్నారి యామిని మృతి చెందారు. నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top