అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంలో హైకోర్టు అడిగిన ప్రశ్నలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు అడిగినా ఇంత వరకు స్పీకర్ ఎందుకు రిప్లై ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సోమవారం అప్పిరెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..`వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా అంశం కోర్టులో ఉంది. ప్రభుత్వం, స్పీకర్ ముందు కోర్టుకు సమాధానం చెప్పి, ఆ తర్వాత మాట్లాడాలి. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పాపం మూట కట్టుకుంటోంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ఆపాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నా చంద్రబాబుకు చెవికి ఎక్కటం లేదు. ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకు మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దీనిపై తిరుగుబాటు చేయబోతున్నారు. వైద్యం అందుబాటులో లేక జనం ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా?. 17 కాలేజీలను ప్రభుత్వంలో కొనసాగించాలి` అని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.