తాడేపల్లి: విజయవాడ కనక దుర్గమ్మ కటాక్షం అందరిపై ఉండాలని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతుండటంతో ఆయన తన ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. `నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి అందరూ కనకదుర్గమ్మ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.