డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ)కి వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

తాడేపల్లి:పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ)తో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. ఇటీవల గుండెపోటుతో బాబ్జీ కుమారుడు అంజన్‌ (53) మరణించారు. అంజన్‌ మృతి పట్ల  వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాబ్జీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంజన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top