రామాయ‌ప‌ట్నం పోర్టు ప‌రిశీల‌న‌ను అడ్డుకోవ‌డం దుర్మార్గం

మాజీ మంత్రి  కాకాణి గోవర్దన్ రెడ్ది  

నెల్లూరు:  రామాయ‌ప‌ట్నం పోర్టు అధికారుల అనుమ‌తి తీసుకొని అక్క‌డికి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య‌గా నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. రామాయపట్నం పోర్ట్ అభివృద్ధిని  కమీష‌న్ల కోసం కూటమి నేతలు అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. పోలీసుల తీరుపై కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..`పోర్ట్ సందర్శనకు  పోర్ట్ అధికారుల అనుమతి ఉన్నా.. పోలీసులు అడ్డుకోవడం దారుణం. స్థానిక ఎమ్మెల్యే అవినీతి  బాగోతం బయటపడుతుందని మమ్మల్ని అడ్డుకున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత మంది పోలీసులు సెక్యూరిటీ కి రాలేదు. మేము పోర్టు సందర్శనకు వెళ్లితే   వైయ‌స్ జగన్ చేసిన అభివృద్ధి ప్రపంచానికి తెలుస్తుందనే  మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మేము టెర్రరిస్ట్‌లామా? పోలీసులు బీహేవ్ చేస్తున్నారు. ఎనబై శాతం పూర్తి అయిన రామాయపట్నం పోర్ట్ ని మిగిలిన  20 శాతం పూర్తి చేయ‌లేక కూటమి ప్రభుత్వం కమీషన్లకు కక్కురి పడుతుంది. కరేడు వాసులను  భ‌య‌పెట్టి  భూములు లాక్కోవలని చూస్తున్నారు. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి పోతున్నాయ్` అని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top