మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై మండ‌లిలో చ‌ర్చ‌కు ప‌ట్టు  

పీపీపీ విధానం ర‌ద్దు చేయాల‌ని  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలు

అమరావతి: ఏపీ శాసన మండలిలో మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై చ‌ర్చించాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప‌ట్టుప‌ట్టారు. ఈ అంశంపై మండ‌లి చైర్మ‌న్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం నోటీసు అంద‌జేశారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాల్సిందేనని పట్టుబ‌ట్టారు.  ఎమ్మెల్సీల ఆందోళనతో మండ‌లిని చైర్మ‌న్ వాయిదా వేశారు అయితే, సభలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగిస్తూ..పీపీపీ విధానం రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.  మండలి పోడియంను చుట్టుముట్టారు. ఈ నినాదాల మధ్య మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.   

Back to Top