వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రగతి పరుగులు... చంద్రబాబు హయాంలో ‘పచ్చ’ మరకలు...

  

ఇదీ.. అభివృద్ధి...  
వైఎస్సార్‌ సీపీ హయాంలోపులివెందుల అభివృద్ధి 
నింగినంటింది. తరాలు చెప్పుకునేలా .. 
జనాలు హర్షించేలా వైఎస్‌ జగన్‌ పాలన సాగించారు.
‘విద్య’కు కోట్ల రూపాయలతో అక్షరాభిషేకం చేశారు. వైద్యానికి కొత్త ‘ఊపిరి’ పోశారు. 
ప్రజలకు ఆహ్లాదాన్ని అందించారు..
ప్రయాణికులకు సౌకర్యాన్ని పంచారు..
బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌తో రైతులకు నేస్తంగా నిలిచారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టి  క్రీడాకారులకు దోస్త్‌గా మారారు.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ప్రగతిని ‘పట్టా’ లెక్కించారు. 
పేదల సొంతింటి కల సాకారం చేస్తూ అక్కచెల్లెమ్మలకు ‘పట్టా’భిషేకం చేశారు.
పులివెందుల చరిత్రలోనే ‘నవ’శకానికి నాంది పలికారు.  
– పులివెందుల 

 

∙‘పచ్చ’పాలకుల దుర్బుద్ధి! 
కూటమి ప్రభుత్వ రాకతో పులివెందుల ప్రగతి చక్రం ఆగింది. అభివృద్ధి చేయకపోగా వైఎస్సార్‌ సీపీ చేసిన అభివృద్ధిపైనా టీడీపీ ప్రభుత్వం కక్షగట్టింది. అరటి రైతుల కోసం వైఎస్సార్‌ సీపీ కోట్ల రూపాయలతో బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ నిర్మిస్తే వినియోగంలోకి తీసుకురావడానికి కూటమి నేతలకు చిత్తశుద్ధి కరువైంది. క్రికెట్‌ స్టేడి యం నిర్మాణానికి ‘ఆట’ంకాలు కలిగిస్తోంది. అంతేనా.. అడుగడుగునా విష సంస్కృతికి తెర తీసింది. ప్రత్యర్థుల పై దాడులకు దిగుతూ.. వాహనాలు కాలుస్తూ రౌడీయిజానికి బీజం వేస్తోంది.   వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధిని కొనసాగించే చిత్తశుద్ధి లేక.. దుర్బుద్ధిని ప్రదర్శిస్తోంది.   

Back to Top