తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు 

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రంగంలోకి దిగిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు

కృష్ణా జిల్లా, మచిలీపట్నం: తుపాను ప్రభావంతో పడిపోయిన చెట్లను తొలగిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని 21వ డివిజన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి థామస్ నోబుల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రహదారులపై పడిపోయిన చెట్లను కట్ చేసి తొలగించే పనులు చేపట్టారు.

తుపాను కారణంగా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, పడిపోయిన చెట్లను తొలగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేశారు.

Back to Top