‘అర్నబ్’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కె.కె. రాజు పర్యటన

55వ వార్డులో కొండవాలు ప్రాంతాల పరిశీలన.. స్థానిక పరిస్థితులపై ఆరా

విశాఖపట్నం: ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశాఖపట్నంలోని 55వ వార్డు కొండవాలు ప్రాంతాల్లో విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన కె.కె. రాజు స్థానిక పరిస్థితులను పరిశీలించి, ప్రజల ఇబ్బందులపై ఆరా తీశారు.
ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావుతో పాటు ఈశ్వర్ రావు, అనిల్ శర్మ, బొట్టా రాజు, లావణ్య, ధోర బాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top