19న ఛలో మెడికల్ కాలేజీ

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌క్కంపూడి రాజా పిలుపు

తూర్పుగోదావరి జిల్లా: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్ముకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ఈ నెల 19న ఛ‌లో మెడిక‌ల్ కాలేజీ కార్య‌క్ర‌మం చేప‌డుతున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌క్కంపూడి రాజా వెల్ల‌డించారు.  వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెడుతున్న ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో యువ‌కులు, విద్యార్థులు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌క్కంపూడి రాజా పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైల్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి,  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు జ‌క్కంపూడి రాజా, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, త‌దిత‌రులు ములాఖ‌త్ అయ్యారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. 

జ‌క్కంపూడి రాజా మాట్లాడుతూ..దేశ చరిత్రలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా ఏకంగా రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైయస్.జగన్ శ్రీకారం చుడుతూ... ఒకే సంవత్సరం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించార‌ని తెలిపారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఐదు మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను సుమారు రూ.8500 కోట్ల ఖర్చుతో నిర్మించేందుకు సంకల్పించార‌ని, అందులో భాగంగా రెండో దశ కింద 2024-25లో పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల లోనూ, మూడో దశ కింద 2025-26 విద్యాసంవత్సరం నాటికి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం లలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించార‌ని చెప్పారు. విద్యా భద్రతతో పాటు,  ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ అడుగులు వేశార‌ని, ఇవి కేవలం కాలేజీలు మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్ దిశగా వేసిన అడుగులగా రాష్ట్ర ప్రజలందరూ భావించార‌ని పేర్కొన్నారు.  ప్రతి వైద్య కళాశాలను 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించామ‌ని వివ‌రించారు. వైద్య ఆరోగ్య రంగంలో ఇంత గొప్ప ఆలోచన చేస్తే.. దీనిమీద కూటమి పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం దారుణంగా ఉంద‌న్నారు. ఈ కాలేజీలకు సంబంధించిన ఫండ్ టై అప్ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింద‌ని గుర్తు చేశారు. మిగిలిన ప‌నులు పూర్తి చేయ‌లేక చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వీటిని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా ఉద్య‌మం చేప‌డుతున్నామ‌ని, ఈ నెల 19న త‌ల‌పెట్టిన ఛ‌లో మెడిక‌ల్ కాలేజీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జ‌క్కంపూడి రాజా కోరారు. 

Back to Top