అనంతపురం: ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో జరిగినట్లు పేర్కొంటున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. వివిధ అఖిలపక్ష పార్టీల నాయకులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు.