చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వెంకటేగౌడకు పార్టీ సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రీజినల్ కో-ఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ ఇన్‌చార్జి రోజా సెల్వమణి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విజయానందరెడ్డి, కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ భరత్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌కుమార్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కృపాలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేయడమే తన లక్ష్యమని వెంకటేగౌడ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.