ఏలూరు: ఏలూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు షేక్ మక్బూల్ అలీతో పాటు 100 మైనారిటీ కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయి. 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్), ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కైకలూరు నియోజకవర్గ పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నాల జాన్ గురునాథ్, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, మాజీ కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.