ఆపదలో అండగా.. ఆత్మీయతలో ముందుగా వైయ‌స్ఆర్‌సీపీ

బాధిత కుటుంబానికి వడ్డీ రఘురామ్ నాయుడు రూ.లక్ష ఆర్థిక సాయం

తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండుప్రోలు గ్రామంలో అగ్నిప్రమాదంతో ఇల్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కొండేపూరి సుశీల కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామ్ నాయుడు ఆపన్నహస్తం అందించారు. కాలిపోయిన ఇంటిని పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.

కష్టపడి నిర్మించుకున్న ఇల్లు అగ్నికి ఆహుతి కావడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబానికి ఆర్థిక చేయూతతో పాటు ధైర్యం చెప్పారు. బాధితుల కన్నీటిని తుడిచి, కష్టకాలంలో ‘మేమున్నాం’ అంటూ అండగా నిలవడం ద్వారా వడ్డీ రఘురామ్ నాయుడు మానవీయ నాయకత్వాన్ని చాటుకున్నారు.

ప్రజల కష్టాలను తన బాధ్యతగా భావించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే నాయకత్వమే ప్రజలకు నిజమైన భరోసా. సుశీల కుటుంబానికి ఆయన అందించిన చేయూత వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాసేవా దృక్పథానికి, మానవీయ విలువలకు నిదర్శనంగా నిలిచింది.

Back to Top