పాకాల బీచ్ ఘటనపై వైయస్ జగన్ సంతాపం

తాడేపల్లి: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి పలువురు యువకులు మృతిచెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అవసరమైన సహాయక, గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబ సభ్యులకు శ్రీ వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని బాధిత కుటుంబాలకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

Back to Top