శెట్టి బలిజ కులానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి 

 మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ డిమాండ్‌

రాజమహేంద్రవరం : కులాల మధ్య చిచ్చు పెట్టిన సీఎం చంద్రబాబు కు శెట్టి బలిజ లు పాలాభిషేకాలు చేస్తున్నారా అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ప్రశ్నించారు.  స్థానిక సెంట్రల్ జైలు సమీపంలోని ఓ ప్రైవేట్ హాల్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల కృష్ణ‌ మాట్లాడుతూ.. 1997లో సీఎం గా చంద్రబాబు అప్పుడు శెట్టి బలిజలతో ఆటలు ఆడుకున్నారని, ఇప్పుడు కూడా మళ్ళీ వారి జీవితాలతో ఆటలు ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని శెట్టి బలిజ లు గ్రహించాలని కోరారు. కుల రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ కుల రాజకీయాలు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోమని స్పష్టం చేశారు.  గతంలో కూడా చంద్రబాబు శెట్టి బలిజ మనోభావాలను కించపరిచారని, ప్రస్తుతం కూడా అదేపంథా అమలు చేస్తున్నారని ఆరోపించారు. కుల  రాజకీయాలకు  పాల్పడుతున్న చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఇన్నీసుపేట  కో ఆపరేటివ్ బ్యాంక్ అన్నపూర్ణ రాజు, మాజీ  ఆర్యాపురం  సత్యనారాయణ స్వామి దేవస్థానం వైస్ చైర్మన్ దుంగా సురేష్,  వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు పూడి కోట, అడపా అనిల్,  బురిడీ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు..

Back to Top