సాగు సంక్షోభానికి స‌ర్కార్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం

వ‌రుస‌గా పంట‌ల ధర పతనంతో అప్పుల ఉబిలో రాయల సీమ రైతులు

తాడేప‌ల్లి:  రాయ‌ల‌సీమ‌లో వ్య‌వ‌సాయం సంక్షోభానికి కూట‌మి స‌ర్కార్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు.   వ‌రుస‌గా పంట‌ల ధ‌ర ప‌త‌నం కావ‌డంతో రాయ‌ల‌సీమ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నార‌ని ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఎంవీఎస్ నాగిరెడ్డి మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

ఎంవీఎస్ నాగిరెడ్డి మాట‌ల్లోనే..
ఉల్లి పంట‌తో మొదలైన సంక్షోభం..అరటి, చినీ, టమాటా నుండి బంతి పూల వ‌ర‌కు ధర పతనం అవుతూనే ఉంది. దీంతో  రాయ‌ల‌సీమ రైతులు అప్పుల ఉబిలో కూరుకు పోతున్నారు. బంతి పూల సాగులో 68.76 శాతం ఉత్పత్తి.. చిత్తూరు జిల్లానే ఉంది. రాష్ట్రంలో నవ రాత్రులు 9 రోజుల పాటు ప్రతి రోజు దరిదపుగా రాష్ట్రం లోని ప్రతి అమ్మవారి దేవాలయం లోను అలంకారాలతో జరిగే పండుగ..దసరా . ఈ 9 రోజులు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందు వలన సీజన్ గా కొద్ది నెలలో వచ్చే పంట ను దసరా పండుగ సమయానికి వచ్చే లా రైతులు సాగు చేస్తారు..ఇందులో ప్రధానమైనది బంతి పూల సాగు. దసరా కి ముందే డిస్ట్రెస్ సేల్ లో కి వెళ్లిపోయిన బంతి..కిలో 10 రూ నుండి 12 రూ కొంటున్నట్లు వస్తున్న వార్తలు..పువ్వులు కోయటానికే కిలోకు 6 నుండి 7 రూ ఖర్చు.. ఎకరాకి 16 వేల నుండి 18 వేల వరకూ మొక్కలు నాటతారు.. ఒకొక మొక్క 2 నుండి 2.5 రూ..ఎకరాకి 40 వేల రూపాయలు పైన కేవలం మొక్క లకే ఖర్చు అవుతుంది. వినాయక చవితి పండగ దినాలలో 2 రోజులు మాత్రమే 50 నుండి 60 రూ రైతుకు వచ్చినది..ఈ సంవత్సరం ఆగష్టు 9 నుండి కురిసిన వర్షాలకు తెగుళ్లు ఎక్కువ వచ్చినవి. ఎకరా దిగుబడి తగ్గినది. దసరా నవ రాత్రులు 9 రోజులు కొంతైనా ధర పెరుగుతుంది అని ఆశతో ఉన్నారు రైతులు..పంట సరాసరి అమ్మకం కనీసం కిలో 35 రూ వస్తే ఖర్చులు వస్తాయి..ఆ పైన వస్తేనే పెట్టుబడి పోను ఎంతో కొంత మిగులుతుంది అని రైతులు చెబుతున్నారు. దసరా 9 రోజులూ ధర కలిస్తే తక్కువ నష్టం తో బయట పడతాం..లేక పోతే చాలా నష్ట పోతాం అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రం మొత్తం అన్ని పూలు కలిపి ఉత్పత్తి 10.88 లక్షల టన్నులు ఉంటే రాయల సీమ లోనే 7 లక్షల టన్నులు(64.39 శాతం) ఉత్పత్తి అవుతుంది. పూల ఉత్పత్తి లో మొదటి స్థానం కడప జిల్లా దైతే మొదటి 9 స్థానాలలో 4 వ స్థానం తూర్పు గోదావరి తప్ప 8 స్థానాలు రాయల సీమ జిల్లాలే..

బంతి పూల ఉత్పత్తి రాష్ట్రం మొత్తం 1.12 లక్షల టన్నులైతే రాయలసీమ లోనే 77 వేల టన్నులు (68.76 శాతం)
1. చిత్తూరు       19.66 వేల ట‌న్నులు 
2. సత్య సాయి 16.27 వేల ట‌న్నులు 
3. అన్నమయ్య 12.8  వేల ట‌న్నులు 
4 .అనంతపురం11.53 వేల ట‌న్నులు 
5. నంద్యాల        6.36 వేల ట‌న్నులు 
6. తూర్పుగోదావరి 5.15 వేల ట‌న్నులు 
7. కడప              4.4   వేల ట‌న్నులు 
8. కృష్ణా              3.9 వేల ట‌న్నులు 
9. కర్నూల్          3.2 వేల ట‌న్నులు 
10. తిరుపతి      3    వేల ట‌న్నులు 
మొట్ట మెదటి 10 జిల్లాల లో తూర్పు గోదావరి, కృష్ణా తప్ప రాయలసీమ 8 జిల్లాలు ప్రధాన ఉత్పత్తి జిల్లాలు. 

రాష్ట్రం మొత్తం పూజలకి, శుభాకార్యాలకి పూలు అందించే రైతులు దసరా పండుగ కు సహజం గా ధర పలికే బంతి పూల ధర కుప్ప కూలి పోవడం ఉల్లి, అరటి, చినీ, టమాటా తో పాటు బంతి పూల రైతులకూ సంక్షోభం.. 

ఈ ఖరీఫ్ వ్యవసాయం 10/9/2025 14 వారాలు దాటేసరికి రాష్ట్రం మొత్తం సాగు 81 శాతం అయితే అనంతపురం 76 శాతం, సత్య సాయి 42 శాతం, అన్నమయ్య 19 శాతం, కడప 35 శాతం, చిత్తూరు 24 శాతంమాత్రమే జిల్లాలలో సాగు జరిగినది..ఈ జిల్లా లలో కనీసం ప్ర‌త్యామ్న‌య‌ పంటల సాగు ప్రణాళికనూ ప్రభుత్వం ప్రకటించలేదు..
రాయల సీమ కే ప్రధాన మైన వేరుశనగ సాగు తగ్గి పోయింది..సాగు జరిగిన వేరుశనగ, మినుము అనావృష్టి, అతి వృష్టి కి దెబ్బ తిన్నది. సాగు సంక్షోభం..వరుస ధరల పతనాలతో రాయలసీమ రైతులపై ప్రమాద‌ ఘంటికలు మోగుతున్నాయ్. 

Back to Top