19న ఛ‌లో మెడిక‌ల్ కాలేజీ విజ‌య‌వంతం చేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం స్టేట్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి పిలుపు

తిరుప‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి, యువ‌జ‌న విభాగాల ఆధ్వ‌ర్యంలో ఈ నెల 19న త‌ల‌పెట్టిన ఛ‌లో మెడిక‌ల్ కాలేజీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం స్టేట్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధ‌వారం తిరుప‌తి న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో యువ‌జ‌న‌, విద్యార్థి విభాగం నేత‌ల‌తో అభిన‌య్‌రెడ్డి ఛ‌లో మెడిక‌ల్ కాలేజీ స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అభిన‌య్‌రెడ్డి మాట్లాడుతూ..`పేద విద్యార్థులకు వైద్య రంగంలో ఎక్కువ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గత ఐదేళ్ల 8,500 కోట్లతో 17 ప్ర‌భుత్వ మెడికల్ కాలేజీల‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. వైద్య సహాయం మెడికల్ కాలేజీలు ద్వారా అందించాలనే దూర దృష్టితో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. కరోనా లాంటి విపత్కర  సమయంలో ప్రైవేట్ హాస్పిటల్ లు దోచుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు పేద వారిని ఆరోజు ఆదుకున్నాయి. చంద్రబాబు 15 ఏళ్ల సీఎం పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నాం. రూ.2 లక్షల 15 వేల కోట్లు ఏడాదిన్నర కాలంలో సీఎం చంద్రబాబు అప్పులు చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా మీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మొద‌లుపెట్టిన‌ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మీ ప్రభుత్వం చిత్తశుద్ధి తో పూర్తి చేయండి. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న అన్ని ప్రభుత్వ మెడికల్ ఛ‌లో కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఇందులో  భాగంగా యువజన విభాగం ఆధ్వర్యంలో మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ సందర్శించి ప్రజలకు నిజాలు తెలిపే ప్రయత్నం చేద్దాం` అని భూమ‌న అభిన‌య్‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top