పరమ పవిత్ర శ్రీ వేంకేటేశ్వర స్వామి సన్నిధిని ఆట స్థలంగా మార్చేసిన టీడీపీ

రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరణలు

వివాదాలకు కేంద్రంగా టీటీడీ 

కూటమి పాలనపై తీవ్రంగా మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 

రాజకీయ ప్రయోజనాలకు వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం 

దీన్నొక రివాజుగా మార్చిన తెలుగుదేశం పార్టీ

స్వామివారి సేవలు, భక్తుల సౌకర్యాలు పట్టని టీటీడీ బోర్డు

నిరంతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైయస్.జగన్ లక్ష్యంగా విమర్శలు

కూటమి పాలనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం

నా హయాంలో పరకామణి చోరీ అంటూ ప్రకటనలు

జ్ఞానశూన్యమూర్ఖేష్ లోకేష్, భక్తిలేని రసరాయుడు బీ ఆర్ నాయుడులను సవాల్ చేస్తున్నా

నా పై ఆరోపణలు నిరూపించండి

సీబీఐతో విచారణ చేయించండి 

మీ ఆరోపణలు నిజమైతే అలిపిలిలో తల నరుక్కుంటా

తప్పని తేలితే బహిరంగ క్షమాపణ చెప్పాలి

లోకేష్, బీఆర్ నాయుడులకు సవాల్ విసిరిన భూమన

తిరుపతి: తమ రాజకీయ ప్రయోజనాలకు శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవడం  అధికార పార్టీకు రివాజుగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...  అధికారం చేతిలో ఉందని... కూటమి ప్రభుత్వం ఎదుట వారి మీద బురద జల్లే కార్యక్రమాన్నినిరంతరం సాగించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక మంచి పని చేసినా.. దాన్ని వక్రీకరించడానికి,  అడ్డదారుల్లో తిరుమల క్షేత్రాన్ని  భ్రష్టు పట్టిస్తున్నామని తెలిసినా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వైయ‌స్ఆర్‌సీపీపై దాడి చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారంలో ఆస్తుల కొట్టేశారన్న  మంత్రి లోకేష్, టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలని పట్టుబట్టారు. తాను తప్పు చేశానని తేలితే అలిపిరిలో తలనరుక్కుంటాన్న భూమన.. అది అబద్దమని తేలితే లోకేష్, బీ ఆర్ నాయడులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

● మీ ఆరోపణల మీద సిబీఐ విచారణకు సిద్ధం..

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారీ వైయ‌స్ఆర్‌సీపీ మీద విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత పదిరోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది.. మా మీద ఇన్ని దఫాలుగా ఆరోపణలు చేస్తారు. అవి ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా వచ్చేట్టు చేస్తారు. మీరంతా విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచడమే పనిగా పెట్టుకున్నారు.  నిజంగా మా హయాంలో అక్రమాలు జరుగాయనుకుంటే సీబీఐ విచారణ చేయించడానికి మీకెందుకు భయం? సాక్షాత్తూ 120 కోట్ల మంది హిందువులకు ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరం జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు... దానిపై సీబీఐ విచారణ చేయాలి ? జ్ఞానశూన్యమూర్ఖేష్ లోకేష్, భక్తిలేని రసరాయుడు బీ ఆర్ నాయుడు కలిసి  భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారం నడిచిందని ఆరోపించారు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు  ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. కాదు అని తేలితే వీరిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. నేను దేనికైనా సిద్దం. 

● టీడీపీకి ఆటస్థలంగా స్వామివారి దివ్యధామం..

త్రైలోక్యనాధుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి దివ్యధామాన్ని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతిపరులకు ఆటస్థలంగా మార్చివేశారు. జరిగింది ఒకటైతే దాన్ని వక్రీకరించడమే కాకుండా చిలవలు, పలువలు చేసి తమ రాజకీయ స్వార్ధం కోసం స్వామి సన్నిధానాన్నే తమ స్వార్ధ క్షేత్రంగా మార్చివేస్తున్నారు. 29-04-2023 సంవత్సరంలో జీయర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తుండగా.. విజిలెన్స్ అధికారులకు అతని దగ్గర 8 వంద డాలర్ల నోట్లు పట్టుకున్నారు. అలా పట్టుబడ్డ సొమ్ము విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.72 వేలు విలువ అని కూడా అధికారులు తేల్చారు. లోతైన పరిశీలన చేయడం ద్వారా అతను దాదాపు 20 ఏళ్లుగా ఈ రకంగా చేస్తున్నాడని మా పార్టీ నేతృత్వంలోని పాలకమండలి, అప్పటి అధికారులే దీన్ని బయటపెట్టారు. 20 ఏళ్లుగా చేస్తున్నాడని తేలింది అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఈ రవికుమార్ చోరీ చేస్తున్నాడని తేటతెల్లం అయింది. రవికుమార్ ను పట్టుకున్నది మా ప్రభుత్వంలోని అధికారులే. పట్టుకున్న తర్వాత అతని శ్రీమతి, కుమార్తెలు జరిగిన ఘోర అపచారానికి, నేరానికి తమ భర్త మీద బాధతో దేవస్థానం అధికారులను సంప్రదించి.. చేసిన తప్పుకు పాపపరిహారంగా, ప్రాయశ్చిత్తంగా దేవుడికి కానుకగా.. రిజిస్ట్రేషన్ విలువ రూ.14 కోట్లుకాగా, మార్కెట్ లో రూ.100 కోట్ల విలువైన ఆస్తిని టీటీడీకి దఖలుపర్చారు.  19-06-2023లో వాళ్లు ఆస్తులు ఇచ్చిన ఆస్తులపై బోర్డు తీర్మానంలో  ఆమోదించారు. అప్పుడు నేను టీటీడీ అధ్యక్షుడిగా లేను. 

● విజిలెన్స్ నివేదికను బయటపెట్టండి...

15 ఏళ్లలో రవికుమార్ ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు. మీ ప్రభుత్వంలో ఆ దొంగను మీరు కనిపెట్టారా చంద్రబాబూ? దోచుకోవాలనుకుంటే దొంగను పట్టుకుంటారా? నిన్న ఓ వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఉన్న సీసీ టీవీ పుటేజ్ విడుదల చేశారు. ఇవన్నీ విజిలెన్స్ అధికారులు వద్ద ఉంటాయి. వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బయటపెట్టారు. మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు టైంలో సీసీటీవీ పుటేజ్ కూడా బయటపెట్టాలి. అవన్నీ ఎరేజ్ అయిపోయాయి అని మరో అబద్దం చెబుతారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణ వేశారు. తిరుపతిలో ఉన్నవారు సరిపోరు అని అమరావతిలో ఉన్న విజిలెన్స్ అధికారులు అంతా నెలల తరబడి శోధించి దీనిమీద నివేదిక సమర్పించారు. మీకు దమ్మూ, ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయటపెట్టాలి. ఎందుకు బయటపెట్టడం లేదు? మీ పార్టీకి చెందిన శాసనసభ సభ్యుడే జనవరిలో దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే... దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి సమాధానం ఇచ్చిన తర్వాత  ఆ నివేదిక ఎందుకు భయటకు రాలేదు ?ఆ నివేదికపై సీఎం చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉన్నా ఎందుకు భయటపెట్టలేదు? 
ఈనాడు పత్రికలో అక్కడ అంతా దోపిడీ జరిగినట్లు రాస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులుగా, వారి సేవలో తరించిన వ్యక్తులగై మేం ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నాం... ఈ ఉదంతంపై సీబీసీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ ఆరోపణలు అబద్దమా? ఆనాడు టీటీడీ అధికారులు చేసింది నిజమా ? అన్నది బయటపడుతుంది. అంతే తప్ప పత్రికాసమావేశాల ద్వారా మా పై ఆరోపణలు దాడి చేయడం వల్ల ఉపయోగం లేదు.  
రూ.100 కోట్లకు పైగా దోపిడీ జరిగింది, ఆ డబ్బులను మేమందరం దోచుకున్నామని చెబుతున్నారు. రవికుమార్ కు ఏయే ఆస్తులున్నాయన్న విషయంపై విజిలెన్స్ అధికారులు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణా,తమిళనాడు రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ అధికారులతో మాట్లాడి ఆ నివేదికను సమర్పించారు. ఇంకా మీరు రవికుమార్ మాకు, మా బినామీలకో రిజిస్ట్రేషన్ చేయించాడంటున్నారు.. ఆ నిజం నిగ్గు తేలాలంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అందుకు మేం సిద్దంగా ఉన్నామన్నారు. టీటీడీ చరిత్రలో ఒక దొంగను పట్టుకున్న తర్వాత అతను స్వచ్ఛంధంగా పరిహారంగా తన ఆస్తుల రాయించిన సంఘటన గతంలో ఒక్కటన్నా ఉందా? అది మా ప్రభుత్వంలో మేం చేసిన ఒక మంచి పని. దాని ద్వారా మేం ఆస్తులు కాజేశామని మీరు అంటున్నారు, దీనిపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతున్నాం. అలా కాకుండా మీ తాబేదారులైన అధికారులతో దర్యాప్తు చేయించి, మామీద లిక్కర్ కేసు తరహాలో దొంగ కేసులు నమోదించడం కాదు. మీరు నిజంగా స్వామి భక్తులైతే, శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్ర మహిమను కాపాడాలన్న చిత్తశుద్ధి కలిగి ఉన్నవారు అయితే... ఏ రకంగా సుప్రీం కోర్టు లడ్డూ విషయంలో జోక్యం చేసుకుని సీబీఐ చేత సిట్ విచారణకు ఆదేశించారో అదే విధంగా విచారణ చేయించాలి. అంతే తప్ప ప్రతిక్షణం మా మీద గుడ్డ కాల్చి వేస్తాం.. మీరు మసి తుడుచుకోండి అంటే ఉపయోగం లేదు. 

● శ్రీవాణి ట్రస్టు మీద మీ ఆరోపణలు ఏమయ్యాయి ?

మీరు అధికారంలోకి రాకముందు నుంచి శ్రీవాణి టిక్కెట్లు ద్వారా మేం వందల కోట్లు తినేసాం అని ఆరోపణలు చేశారు. దానిమీద విజిలెన్స్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు?. శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు? రద్దు చేయకపోగా... 22-07-2025 తేదీన ఇదే బీ ఆర్ నాయుడు అధ్యక్షతన గతంలో మేము 1000 శ్రీవాణి టిక్కెట్లు ఇస్తుంటే దాన్ని 1500 కు పెంచడంతోపాటు 2 వేలకు పెంచడానికి తీర్మానం చేశారా ? లేదా? కానీ గతంలో శ్రీవాణి టిక్కెట్లు పై మా మీద విపరీతంగా బురద జల్లారు. కానీ శ్రీవాణి అత్యుత్తమైన ట్రస్ట్ అని తేలిపోయింది. 

● బంగారు బిస్కెట్ చోరీ సీసీ టీవీ పుటేజ్ ఏమైంది ?

మీ హయాంలో జనవరిలో ఒక వ్యక్తి బంగారం బిస్కెట్ కొట్టేశారని పత్రికల్లో వచ్చింది, బోర్డు కూడా ప్రకటించింది. మరి అతని చేత ఎంతుకు పాప పరిహారం చేయించలేదు? అతని విజువల్స్ ఎందుకు భయటపెట్టలేదు? మరి మీరేదో సాధించినట్టు ఎందుకు విజువల్స్ చూపించారు? రోజూ పరకామణి లో ఏం జరుగుతుందో పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి చూపించాలి. కానీ మీరు ఆ పనిచేయలేరు. కారణం మీరు నిరంతరం భగవంతుడ్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేస్తూ.. మా మీద నిందారోపణలు చేయడానికే మీ పాలనా సమయం అంతా ఉపయోగిస్తున్నారు.
చివరకు మీరు విఐపీ బ్రేక్ దర్శనాలు కట్టడి చేస్తున్నామంటూనే దాదాపు 7,500 ఇస్తున్నారు. ఇది చాలదన్నట్టు బీ ఆర్ నాయుడు గారు ఈ దర్శనాలను ఇంకా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మరలా మేం ఒక తప్పు చేయలేదని చెబుతున్న బీ ఆర్ నాయుడుగారూ మీరు వచ్చినప్పటి నుంచి అడుగడుగునా తప్పులే చేస్తున్నారు. మీ హయాంలో మొదలుపెట్టిన దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని అతని ఆస్తులని భగవంతుడికి రాయించాం.అదీ మా గొప్పదనం. మీరు మాత్రం మేం దోపిడీ చేశామని ఆరోపణలు చేస్తారు. సదరు రవికుమార్ ను కూడా విజిలెన్స్ అధికారులను పిలిపించుకున్నారు. అందులో అధికారులు, ఇతరుల పాత్ర లేదని తేలింది కాబట్టే.. ఆ విచారణను బయటపెట్టకుండా ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా గతంలో జరిగిన తతంగమే. కొత్తగా బయటకు వచ్చిన విషయమేమీ లేదు. మేం చేసింది తప్పో కాదో తెలియాలంటే.. మీ ఆరోపణలు మీద సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.  

● కూటమి రాజకీయ ప్రయోజనాలకు వేదిగా శ్రీవారి క్షేత్రం...

మీ రాజకీయ ప్రయోజనాలను శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవడం మీకు రివాజుగా మారింది. మీ చేతిలో అధికారం ఉంది కదాని ఎదుట వారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని మీరు నిరంతరాయంగా సాగిస్తున్నారు. మేము ఒక మంచి పని చేసినా.. దాన్ని వక్రీకరించడానికి,  అడ్డదారుల్లో తిరుమల క్షేత్రాన్ని  భ్రష్టు పట్టిస్తున్నామని తెలిసినా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మా మీద దాడి చేస్తున్నారు. అలా చేస్తున్న ప్రతిసారీ మా మీద విమర్శలు గుప్పించడం ఆ తర్వాత పదిరోజులకు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది.. మా మీద ఇన్ని దఫాలుగా ఆరోపణలు చేస్తూ.. ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా వచ్చేట్టు చేస్తారు. మీరంతా విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచడమే పనిగా పెట్టుకున్నారు. 
నిజంగా మా హయాంలో అక్రమాలు జరుగాయనుకుంటే సీబీఐ విచారణ చేయించడానికి మీకెందుకు భయం? సాక్షాత్తూ 120 కోట్ల మంది హిందువులకు ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరం జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు... దానిపై సీబీఐ విచారణ చేయాలి ?
మా మీద బురదజల్లితే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో మాకు తెలుసు, కారణం మేం ఎలాంటి తప్పు చేయలేదు. మా మీద బురద వేస్తున్న మీరు దాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నాను. రవికుమార్  అతని కుటుంబం చేసిన ప్రాయశ్చిత్త చర్య అందరూ ఆహ్వానించతగ్గది.  మా హయాంలో రూ.1000 కోట్లు దోచామని చెబుతున్నారు.. మరి మీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రవికుమార్ మూటలు, మూటలు ఎత్తుకుని పోయాడా? వేంకటేశ్వరస్వామి పరకాణిలో పడినదంతా ఎత్తుకుని పోయాడా? 

● చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే దేవుడు శిక్షించాడు..

నేను నిజమైన భక్తుడిని కాబట్టే నాపై అలిపిరిలో దాడి జరిగినా ప్రాణాలతో భయటపడ్డానని చంద్రబాబు చెప్పుకుంటాడు. కానీ నీ మీద దాడి ఎందుకు జరిగింది చంద్రబాబూ? నువ్వు తప్పు చేశావు, దేవుడికి నీ మీద కోపం ఉంది కాబట్టే దాడి జరిగింది. తప్పు చేసిన వాళ్లను దేవుడి చంపడు, శిక్షలు విధిస్తాడు. ఆ శిక్ష నీకు దేవుడు రెండు శతాబ్దాల క్రితమే వేశాడు. రవికుమార్ తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆస్తులు రాసిచ్చాడు.  మా హయాంలో అధికారులు చట్ట ప్రకారమే వ్యవహరించారు. కానీ మీరు మా మీద బురద జల్లడానికి దాన్ని అస్త్రంగా వాడుకుని విఫలమయ్యారు. ఒకవేళ మీరు సీబీఐ విచారణ వేసినా అప్పుడు కూడా మీరే దొరికిపోతారు. కానీ మేం ఏ తప్పూ చేయలేదని ప్రజలకు తెలుస్తుంది. మాకు మీలా దుష్ట ఆలోచనలు ఉంటే.. రవికుమార్ ను పట్టుకున్నప్పుడు చంద్రబాబు హయాంలోనే ఇది జరిగిందని రాజకీయ ప్రేరితమైన ప్రకటన చేయవచ్చు. కానీ మేం ఆ పనిచేయలేదు. కారణం ఆ  వేంకటేశ్వరస్వామి మీద మాకు భక్తి ఉంది. రవికుమార్ ఒకవేళ టీడీపీ ప్రభుత్వ హయాంలో దొరికి ఉంటే అతని ఆస్తులను టీటీడీకి కాకుండా టీడీపీకి వెళ్లిపోయేవి. ఇది నూటికి నూరుశాతం నిజం. ఇది మాకు, టీడీపీకి ఉన్న తేడా అని స్పష్టం చేసిన భూమన... తన మీద కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలుపై సీబీఐ విచారణ చేయించాలని మరోసారి చంద్రబాబును డిమాండ్ చేశారు.  
నిన్నవిడుదల చేసిన సీసీటీవి పుటేజ్ తో పాండవులను ఒక్కరోజు ఓడించిన సైంధవుడిలా మాదే  విజయం అనుకుని నిద్రపోయి ఉండవచ్చు. కానీ శ్రీవారి దివ్యధామం ఔన్యత్యం కోసం మీ మీద పోరాటాన్ని నిరంతం చేస్తూనే ఉంటామని, అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.

Back to Top