తాడేపల్లి: మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 21) ఆయనకు వైయస్ జగన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘తెలుగు సాహిత్యానికి వేగుచుక్క, అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించి మహిళాభ్యుదయానికి పాటుపడిన సాంఘిక సంస్కర్త గురజాడ అప్పారావు గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.