నంద్యాల జిల్లా: చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైయస్ఆర్‌సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుదీర్ దారా తీవ్రంగా విమర్శించారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాల వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త డా. సుదీర్ దారా మాట్లాడుతూ .. దివంగత నేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పొతిరెడ్డిపాడు నుంచి దిగువకు 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని గుర్తు చేశారు. శ్రీశైలం వద్ద 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండటంతో, రాయలసీమ ప్రాంతంలోని పొతిరెడ్డిపాడు, బానకచెర్ల, గాలేరు–నగరి, గండికోట, మద్రాసు, నెల్లూరు ప్రాంతాలకు నీరు అందడంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వరద నీటిని తరలించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే పొతిరెడ్డిపాడు నుంచి నీరు ఎత్తిపోసేలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. చంద్రబాబు చేసిందీ ఇదేనా? వైయస్ జగన్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి కేసులు వేయించారని ఆరోపించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందీ ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు, డిండి లిఫ్ట్‌లు పెరిగినప్పుడు మీరు సీఎంగా ఉండి ఎందుకు అడ్డుకోలేదని సుదీర్ దారా నిలదీశారు. రాయలసీమను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని, వైయస్ జగన్ మాత్రం ఈ ప్రాంత కరువును తరిమికొట్టాలనే ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయడానికి కృషి చేశారని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయకపోతే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు రాయలసీమలో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రాయలసీమను సర్వనాశనం రైతు పక్షాన చంద్రబాబు ఎప్పుడైనా నిలబడ్డారా అని ప్రశ్నిస్తూ, రెండు కళ్ల సిద్ధాంతంతో రాయలసీమను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణకు తలొగ్గి హైదరాబాద్ వదిలి వచ్చారని విమర్శించారు. చంద్రబాబు & కో స్వయంగా వచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. నందికొట్కూరు ప్రజల త్యాగ ఫలితమే ఈ రాయలసీమ లిఫ్ట్ అని, రాయలసీమ ప్రజలకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డా. సుదీర్ దారా డిమాండ్ చేశారు.