రైతులకిచ్చిన హామీలు అమలు చేయమనడం తప్పా?

ఎందుకు ఆ స్థాయిలో విరుచుకుపాటు? గగ్గోలు?

చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన దొంతిరెడ్డి వేమారెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంగళగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి.

అమరావతిపై వైయస్‌ జగన్‌ చెప్పినవవ్నీ పచ్చి నిజాలు

అందుకే జవాబు చెప్పలేక ఎల్లో మీడియాలో దుష్ప్రచారం

దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజం

రాజధాని కోసం అపరిమితంగా భూసమీకరణ

తొలి విడతలో మొత్తం 52 వేల ఎకరాల సేకరణ

ఇప్పుడు భూసమీకరణలో మరో 50 వేల ఎకరాలు

ఒక్కో ఎకరాలో మౌలిక వసతులకు రూ.2 కోట్లు

రాజధాని నిర్మాణంలో ప్రతి రూపాయి ఒక అప్పు

రైతులకు ఇచ్చిన హామీలు అమలు లేనే లేదు

దాన్నే జగన్‌గారు ప్రశ్నిస్తే జీర్ణించుకోలకపోతున్నారు

దొంతిరెడ్డి వేమారెడ్డి ఆక్షేపణ

విశాఖలో కంపెనీలకు ఎకరా 99 పైసలకే ఇస్తున్నారు

మరి అమరావతిలో అలా ఎందుకివ్వడం లేదు?

అమరావతికి ఐటీ పరిశ్రమలు, కంపెనీలు రావద్దా?

ఇక్కడ మా పిల్లలకు ఉపాధి అవకాశాలు ఉండొద్దా?

ప్రెస్‌మీట్‌లో మంత్రి లోకేష్‌ను నిలదీసిన వేమారెడ్డి

తాడేపల్లి: అమరావతి మీద వైయస్‌.జగన్‌ వాస్తవాలు చెబితే పచ్చ మీడియా, పచ్చ పత్రికలు రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నాయని మంగళగిరి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కిచ్చిన హామీని అమలు చేయమనడం తప్పెలా అవుతుందని నిలదీశారు. తొలిదశలో ప్రభుత్వ భూమితో కలుపుకుని 52 వేల ఎకరాలు సమీకరించిన చంద్రబాబు లెక్కల ప్రకారమే.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం, ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం లక్ష కోట్లు కావాలి. అలాంటప్పుడు ఇంకా 50 వేల ఎకరాలు ఏ విధంగా సేకరిస్తారని ప్రశ్నించారు.
    రాజధాని రైతుల కిచ్చిన హామీని నెరవేర్చి.. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని జగన్‌గారు సూచిస్తే.. సలహాలు కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకోలేకపోతుందని ఆక్షేపించారు. రాజధాని అప్పు కోసం వైయ‌స్ఆర్‌సీపీ అడ్డుపడుతుందన్న కూటమి ప్రభుత్వ ఆరోపణలను కొట్టి పారేసిన ఆయన ... ఆధారాలుటే చూపించాలని డిమాండ్‌ చేశారు. కూటిమి ప్రభుత్వం ఆడలేక మద్దెలోడు అన్న తరహాలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
    మరోవైపు  విశాఖ తరహాలో ఎకార 99 పైసలు చొప్పున...  అమరావతిలో ఐటీ పరిశ్రమలు,  కంపెనీలకు భూములు ఎందుకు ఇవ్వడం లేని మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. అమరావతి పిల్లలకు ఉపాధి అవకాశాలు ఉండొద్దా అని నిలదీశారు. అమరావతి ప్రజలను, రైతులను ఎల్లకాలం మోసం చేయలేదని... తక్షణమే రైతులకివ్వాల్సిన ప్లాట్లు ఇప్పించాలని వేమారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..:

రైతులకిచ్చిన హామీలు నెరవేర్చండి:
    అమరావతి కోసం రైతుల నుంచి మీరు భూములు తీసుకుని 11 ఏళ్లు దాటింది, రైతులకిస్తామన్నది ఇవ్వండని అడగడం తప్పా? మరో రెండేళ్ల వరకు మీరు రాజధానిలో ఏం చేస్తారో అర్ధం కాని పరిస్దితి? అలాంటి నేపధ్యంలో రైతు తన భూమిని 14–15 ఏళ్లు ఆకాశంలో పెట్టి  ఏ విధంగా బ్రతుకుతాడు చంద్రబాబుగారూ? పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వారి జీవనాధారం ఎలా? మీరు ఇస్తామన్న పదిసెంట్లో, అరెకరమో మాకు ఇస్తారనుకుంటే.. అవి గూగుల్‌ లో తప్ప భూమిమీద కనిపించడం లేదు.
    చంద్రబాబు ప్రభుత్వం వద్ద ప్రభుత్వ భూమితోపాటు రైతుల నుంచి సేకరించిన భూమితో సహా మొత్తం 52వేల ఎకరాలుంది. ఒక ఎకరా అభివృద్ధికి కనీసం రూ.2 కోట్లు ఖర్చవుతుందని మీరే చెప్పారు. ఆ లెక్కన 52 వేల ఎకరాలకు రూ.1 లక్ష కోట్లు ఉండాలి. ఇది చాలదన్నట్లు మీరు తాజాగా మరో 50 వేల ఎకరాలు కావాలని అడిగారు. దానికి మీ మంత్రులు, యంత్రాంగం ఊళ్లమీద పడి తిరుగుతున్నాయి. భూములిస్తామన్నవాళ్లు కొందరైతే ఇవ్వమని కూడా చెప్పారు. అందులో ఒక కుటుంబానికి రూ.1.50 ఇస్తామంటున్నారు. అదెలా అన్నది చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో రైతులకిచ్చిన హామీలను నెరవేర్చి, మీ ఇష్టం వచ్చినట్లు రాజధాని కట్టుకొండి. 
    కానీ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు అప్పు తేవాలి, ఆ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది కాబట్టి  రాష్ట్ర భావితరాలు ఏం కావాలని వైయస్‌.జగన్‌ ప్రశ్నిస్తున్నారు. దాన్ని వదిలిపెట్టిన పచ్చమీడియా... సమస్యను పక్కదోవ పట్టిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఎవరికి తోచింది వాళ్లు రాశారు. ప్రజలేమీ అర్ధం చేసుకోవడం లేదు ఇక్కడ వాస్తవాలేవీ వారికి అర్దం కావడంలేదని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడినట్టే. మీ మేధా సంపత్తిని రైతుల బాగోగులు కోసం ఉపయోగించండి. ఇప్పటికే వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. గ్రౌండ్‌ చేయాల్సిన పనులున్నాయి. ఇవి కూడా సాధారణ అంచనాలు కంటే కొన్ని రెట్లు అధికంగా వేశారు. కారణం గుంట ప్రాంతం కావడంతో పునాది ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ వేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. అంటే మీరు రూ.2 లక్షల కోట్లు గుంతలో పోస్తున్నారు. నీళ్ల మడుగులో కుమ్మరిస్తున్నారా? అది ఆలోచన చేసి రాష్ట్ర ప్రజల మనుగడ కోసం చేయమంటే అది తప్పా? అదే విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌ స్పష్టం చేశారు. పచ్చమీడియా అవేవీ చూపించడం లేదు. 

ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారు?:
    పైగా చంద్రబాబు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, మంగళగిరి మెగా సిటీ అవుతుందని చెబుతున్నారు. ఇదేదీ మీరు చేసింది కాదు.. తాడేపల్లి స్దానికుడిగా చెబుతున్నాను మీరు రాజధానిగా అమరావతి ప్రకటించకముందే ఈ ప్రాంతం అద్భుతంగా అభివద్ధి చెందుతుంది. గుంటూరు విజయవాడ కలిసి మెగా సిటీ అవుతుందన్న సంగతి మాకందరికీ తెలుసు. కానీ మీరు 24 వేల ఎకరాలకు కేవలం జంగిల్‌ క్లియరెన్స్‌ కోసమే రూ.36 కోట్లు ఖర్చుపెట్టారు. డీవాటరింగ్‌ కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు. మరలా ఇప్పుడు మరో రూ.400 కోట్లకి టెండర్లు పిలిచారు.
    ప్రపంచ బ్యాంకు కూడా గతంలోనే వాటర్‌ డైవర్షన్‌ స్కీమ్‌ ని స్ట్రీమ్‌ లైన్‌ చేయమని చెప్పింది. అది చేసిన తర్వాత మిగిలిన పనులకు వెళ్లమని చెప్పినా మీరా పనిచేయలేదు. వరద  నీటిని పంపులతో ఎన్నేళ్లు ఆపుతారు? దాన్ని గ్రావిటీతో మరో నదిలోనో, సముద్రంలోనే కలిపే యంత్రాంగం కావాలి. అందుకోసం గుంటను మెరకపర్చాలి. దానికోసం విజయవాడ చుట్టూ కొండలను తవ్వినా సాధ్యం కాదు. మేం అదే చెప్పాం తప్ప... రాజధాని మార్చమని కాదు. గతంలో కూడా చెప్పాం విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి సమీపంలో మంచి స్థలాలున్నాయి. అక్కడ కడతే శాశ్వతంగా రాజధాని తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. కానీ మీరు ఏ ఆలోచనతో చెప్పారో కాని మీరన్నది సెల్ఫ్‌ పైనాన్స్‌ సిటీ అవుతుందో అప్పుల సిటీ అవుతుందో రాష్ట్రాన్ని ఎటు ముంచబోతున్నారో మీకే తెలియాలి. ఎంతకాలం ఇలా ప్రజలను మభ్యపెడతారు?

రాజధానికి మా పార్టీ వ్యతిరేకం కాదు:
    రాజధానిలో సమస్య ఇలా ఉంది, దానికి ఈ విధంగా చేస్తే బాగుంటుందని వైయస్‌.జగన్‌ చెబితే దాన్ని చిలువలు, పలువలు చేసి రాష్ట్ర మంతా బాకాఊది వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. మేమెవరు ఆపడానికి? అధికారం మీ చేతుల్లో ఉంది. మేం ప్రజలకు మంచి చేయాలని మాత్రమే కోరుతున్నాం. ప్రజలందరికీ ఈ వాస్తవాలు తెలియజేయడమే  మా ఉద్దేశ్యం. మేం మరోచోట రాజధాని మార్చి పెడతామని చెప్పలేదు. ఇప్పటికే రూ.50 వేల కోట్లకు రాజధానిలో టెండర్లు పిలిచారు. అయనా అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు కానీ... మట్టి మాఫియా మాత్రం జోరుగా నడుస్తోంది. 
అలాంటి వార్తలు రాసి.. ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేయాలో రాయకుండా... తప్పుడు వార్తలు రాయొద్దు. 

రైతుల పొట్ట కొట్టవద్దు:
    గతంలో రాజధాని ప్రాంతంలో వరదల వల్ల నీరు నిల్చిపోతే మంత్రి నారాయణ 50 మీటర్ల మేర హైవేని బ్రీచ్‌ చేస్తే తప్ప నీళ్లు బయటకి పోని పరిస్థితి చూశాం. నిజం కాదని చెప్పగలరా? ఇలాంటివన్నీ ఆలోచన చేసి.. తక్కువ ఖర్చుతో చేపట్టమని చెప్పాం. మా ఆలోచన మీరు స్వీకరిస్తారని మేం భావించడం లేదు కానీ... అది మా బాధ్యత. మీరు అమరావతిలో చదరపు అడుగుకి రూ.11వేలు ఇచ్చే బదులు.. మేం చెప్పిన చోట అయితే తక్కువ ఖర్చుతో నిర్మాణం చేయవద్దు. భారీ ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లనే చదరపు అడుగు రూ.4వేలకే నిర్మాణం చేస్తే..రూ.11వేలు ఏ రకంగా సమంజసం? 
    మీరు మీ అనుయాయుల ఆర్దికాభివృద్ధి కోసం ఏమాలోచిస్తున్నారో మాకు తెలియదు కానీ.. రైతుల పొట్టకొట్టవద్దు. రామారావులా మరో రైతు గుండాగి చనిపోయే పరస్ధితి తీసుకురావద్దుని కోరుతున్నాం. మీకున్న యంత్రాంగంతో మా మాటలను కూడా మీరు వక్రీకరించినా.. ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేదు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. సామాన్య రైతు ఆశపడి..తనిచ్చే ఎకరాకు మీరిచ్చే 20 సెంట్ల కోట్ల ఖరీదు చేసే స్దలానికి ఆశపడి మీకు భూములిస్తే.. ఆ ఆశను చంపి మనుషులు ప్రాణాలు తీయొద్దని వేమారెడ్డి ప్రభుత్వాన్న హెచ్చరించారు.  రైతు కంటతడి పెడితే ప్రభుత్వం తన నాశనం తానే కొనితెచ్చుకున్నట్టే.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
    ప్రపంచ బ్యాంకు కంటే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణ కమిటీ వేస్తే వారు కూడా ఇది రాజధానికి అనుకూలం కాదని చెప్పారు. కానీ ఇక్కడ రాజధాని పెట్టాలని ఎందుకు చంద్రబాబు ఫిక్స్‌ అయ్యారో ఎవరికీ తెలియదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తరహాలో  భారీ సినిమా  స్కెచ్‌  వేసి చంద్రబాబు రైతులను మోసం చేశారు. బయటకు చెప్పుకోలేక రైతులు బాధపడుతున్నారు. ప్రపంచంలో వరదనీటిని పంప్‌ చేసే విధానం ఇక్కడ తప్ప ఎక్కడా లేదు.
    రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకో, వేరెవరికో అడ్డం పడ్డారని ఆధారాలు చూపించమని కోరుతున్నాం. మీరు చెప్పేవే జనాలు నమ్మతున్నారని భావించవద్దు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు మీకు చేతకాక మా పై నిందలు వేయడం సరికాదు. ప్రజలు టైం కోసం ఎదురు చూస్తున్నారు.
    మరోవైపు 99 పైసలకే పరిశ్రమలకు భూములిస్తామని చెబుతున్న మంత్రి లోకేష్‌ .. అదేదో రాజధాని భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేస్తేనైనా మా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. అది మాత్రం చేయడం లేదు. ఇక్కడ వచ్చిన పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి. 
    ఇటీవల బ్యాంకులు తమ కార్యాలయాలకు టెంకాయ కొట్టారు. బ్యాంకులు కట్టాం కానీ డిపాజిట్‌ చేయడానికి జనాలు ఎక్కడా అని ఎదురు చూస్తున్నారు .వీళ్ల ఆలోచనలు ఇలా ఉన్నాయి. అమరావతి ప్రజలను, రైతులను ఎక్కువ కాలం మోసం చేయలేదు. స్ధానికి రైతులుగా మా విజ్ఞప్తి ఒక్కటే రైతులను బ్రతికించండి. వారికి నష్టం చేయవద్దు. మాకు ఇస్తామన్న ప్లాట్లు వీలైనంత త్వరగా ఇప్పించాలని దొంతిరెడ్డి వేమారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Back to Top