సంబేపల్లె: దుద్యాల గ్రామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యర్రపు రెడ్డి బసిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం పొట్రెడ్డిగారి పల్లెలో శనివారం నిర్వహించిన బసిరెడ్డి దశదిన కర్మకాండ కార్యక్రమంలో పాల్గొని వారు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బసిరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా బసిరెడ్డి గుర్తుండిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, అఖిల భారత పంచాయతీ రాజ్ కార్యదర్శి చిదంబర్ రెడ్డి, పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శి గొర్ల ఉపేంద్రా రెడ్డి, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, గొర్ల రమేష్ రెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద రెడ్డి, లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, వీరబల్లె ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. అలాగే వైస్ ఎంపీపీలు మీసాల ఆంజనేయులు, శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ దండు నాగభూషన్ రెడ్డి, నాయకులు వివి ప్రతాప్ రెడ్డి, అన్నారెడ్డి, మాజీ సర్పంచ్ దేవపట్ల వెంకట్రామిరెడ్డి, మాజీ డిసిసీబీ డైరెక్టర్ సేఠ్ వెంకట్రామిరెడ్డి, చింతల జనార్దన్ రెడ్డి, రెడ్డికుమార్ రెడ్డి, పిచ్చిరెడ్డి, నాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బసిరెడ్డికి నివాళులర్పించారు.