ఈనాడు దినపత్రిక తప్పుడు క‌థ‌నాల‌పై దాడిశెట్టి రాజా ఫైర్‌

 కాకినాడ: ఎల్లో మీడియా తీరుపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక తమపై లక్ష్యంగా పెట్టుకుని వార్తలు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలంటే ముందుగా ఎల్లో మీడియాను ఎదుర్కోవాల్సి వస్తోందని రాజా వ్యాఖ్యానించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఒక చిన్న అంశాన్ని రెండు సంవత్సరాల పాటు ఎల్లో మీడియా ప్రాచుర్యంలో ఉంచిందని, తన గన్‌మెన్‌కు సంబంధించిన వ్యక్తిగత వివాదాలను తనపై మోపారని తెలిపారు.
ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి 20 నెలలు గడిచినా, మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తనపై వార్తలు రాయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఆ గన్‌మెన్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, పాత విషయాలను తవ్వి తనపై ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. నిజాయితీగా వార్తలు రాయాలంటే అన్ని వాస్తవాలను వెల్లడించాలని, తమ స్పందనను కూడా ప్రచురించాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు.
 

Back to Top