నైట్ ఫుడ్ కోర్ట్ పునఃస్థాపనకు రిలే నిరాహార దీక్షలు

మ‌ద్ద‌తు తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు 

విశాఖపట్నం: సెంట్రల్ పార్క్ వద్ద తొలగించబడిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునఃస్థాపించాలనే డిమాండ్‌తో నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపుతో అనేక మంది చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే జిల్లా కలెక్టర్, కమిషనర్‌లను కలిసి సమస్యను వివరిస్తామని, పరిష్కారం లభించకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన మొల్లి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్ గాంధి, పళ్ళ దుర్గ, జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు,  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి కూడా పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.

Back to Top