వైయ‌స్ఆర్‌టీఏ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన వైయ‌స్‌ జగన్ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ టీచర్స్‌ అసోసియేషన్‌(వైయ‌స్ఆర్‌టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కా­ర్యదర్శి ఎస్‌కే జంషీద్, ట్రెజరర్‌ ఎస్‌.ప్రేమ్‌ సాగర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీకే వెంకట్‌నాథ్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు బి.సురేశ్, ఎం.వి.మహంకాళీరావు, జి.వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top