విశాఖపట్నం: ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న వైయస్ఆర్‌సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి తన మనసున్న నాయకత్వాన్ని చాటుకున్నారు. 38వ వార్డు సీతారాం స్వామి టెంపుల్ స్ట్రీట్‌లో నివసించే తామరపల్లి శేఖర్ మృతి చెందడంతో ఆయన కుటుంబానికి వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు. శేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి, వారి పిల్లల చదువు నిమిత్తం తక్షణ సహాయంగా రూ.5,000ను శేఖర్ భార్య అనంతలక్ష్మికి అందజేశారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంచి చేయాలంటే పదవులు అవసరం లేదని, మంచి మనసు ఉంటే చాలని వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి నిరూపించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వాసుపల్లి గణేష్ కుమార్, ప్రస్తుతం కూడా ప్రజాసేవకు వెనకడుగు వేయకుండా తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలకు స్థానికుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో 38వ వార్డు అధ్యక్షులు గురజాపు రవి, కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజు, చేపల బుడ్డి, కోసూరి కిరణ్, పట్నాల సతీష్, రమాదేవి, అన్మోల్, శ్యామ్, సందీప్, అనీష్, సాగర్, అప్పలరాజు, ప్రసాద్, మృత్యుంజయచారి, నాగబాబు, చేపల రాజు, 39వ వార్డు ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్, సౌత్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్, చోడిపిళ్లి శివ తదితరులు పాల్గొన్నారు.