వైయ‌స్ఆర్‌ టీయూసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్‌టీయూసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక వర్గ హక్కుల పరిరక్షణలో వైయ‌స్ఆర్‌టీయూసీ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. శ్రీ వైయస్‌ జగన్ గారు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమమే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన లక్ష్యమని, వైయ‌స్ఆర్‌టీయూసీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా పార్టీ ఎల్లప్పుడూ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌యూసీ రాష్ట్ర అధ్యక్షుడు  పూనూరు గౌతమ్‌ రెడ్డి, అలాగే వైయ‌స్ఆర్‌టీయూసీ అన్ని జిల్లాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. 

Back to Top