మాజీ స్కూల్ కమిటీ చైర్మన్‌కు త‌లారి రంగ‌య్య‌ పరామర్శ

అనంత‌పురం: కుందుర్పి మండల కేంద్రానికి చెందిన మాజీ స్కూల్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ మూర్తి అనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య గురువారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. లక్ష్మణ్ మూర్తి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న తలారి రంగయ్య, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స వివరాలను పరిశీలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, లక్ష్మణ్ మూర్తి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఎనుములదొడ్డి సర్పంచ్ విజయకుమార్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Back to Top