టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి డిమాండ్‌

క‌ర్నూలు:  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆలూరు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి డిమాండ్ చేశారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బుసినే విరుపాక్షి మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పవిత్ర సంస్థకు చైర్మన్‌గా ఉన్న వ్యక్తి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం తగదని అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవడం లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు తానే మాట్లాడుతూ తనకు హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయని, టీటీడీ చైర్మన్ పదవి ఒక్కటే తన పని కాదని చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విరుపాక్షి వ్యాఖ్యానించారు. అందువల్ల వెంటనే బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి డిమాండ్ చేశారు.
 

Back to Top