ఉపరాష్ట్రపతికి వైయ‌స్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

తాడేప‌ల్లి: భారతదేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ జన్మదినం నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా విషెస్‌ తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.

 ‘‘భారతదేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశానికి దీర్ఘకాలం మీరు సేవలు అందించాలని.. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. అయితే..

వైయ‌స్‌ జగన్‌ చేసిన ట్వీట్‌కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ స్పందించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ భారత దేశపు 15వ ఉపరాష్ట్రపతి. తమిళనాడుకు చెందిన ఈయన.. బీజేపీలో సుదీర్ఘకాలం పని చేశారు. లోక్‌సభ సభ్యుడిగా, తమిళనాడు బీజేపీ చీఫ్‌గా,  ఆపై పలు రాష్ట్రాలకు గవర్నర్‌గానూ పని చేశారు. 

Back to Top