నేడు ‘చలో దుప్పుతురు’కు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు 

అనకాపల్లి: జిల్లాలోని దుప్పుతురు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్రాండెక్స్ సంస్థ యాజమాన్యం చేపడుతున్న ప్రహరీ గోడ నిర్మాణంపై గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రైతులకు తగిన R&R (పునరావాస, పునరుద్ధరణ) ప్యాకేజీ ఇవ్వకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనల మధ్య పోలీసులు భారీగా మోహరించి ప్రహరీ గోడ నిర్మాణ పనులను కొనసాగించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. నిరసన వ్యక్తం చేసిన పలువురు గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులకు మద్దతుగా  వైయ‌స్ఆర్‌సీపీ నేడు “చలో దుప్పుతురు” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే సరైన R&R ప్యాకేజీ ప్రకటించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.  అదే సమయంలో ఎన్నికలకు ముందు గ్రామాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఇప్పుడు మాట తప్పారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. గ్రామస్తుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. 

Back to Top