తాడేపల్లి: ఎస్ఐర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో వైయస్ఆర్‌సీపీఓటర్ల పేర్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరు గుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, బీఎల్ఎలు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైయస్ఆర్‌సీపీస్టేట్ కో-ఆర్డినే టర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షులతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎస్ఐర్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదుచేస్తున్నారనే సమాచారం వస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి వైయస్ఆర్‌సీపీ ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. బీఎల్ఎలు, బూత్ స్థాయి నాయకులు అప్ర మత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ఉపాధి కోసం వెళ్లిన వారి పేర్లను తొలగించే అవకాశముందని, అలాంటి ప్రతి ఓటరుని గుర్తించి వారి ఓటు రక్షించే బాధ్యత పార్టీ పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ప్రతీ చర్యను నిశితంగా పరిశీలించాలి. కొంతమంది అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రతీ చర్యను నిశితంగా పరిశీలించాలని సజ్జల సూచించారు. బీఎల్ ్వలు సహకరించకపోతే పార్టీ సీనియర్ నేతలను సంప్రదించాలని, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వెంటనే అన్ని నియోజకవర్గ ఇన్చార్జ్లతో సమావేశాలు నిర్వహించి సమ న్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే వార్ రూమ్ ఏర్పాటుచేసి అవసరమైన నెట్వర్క్ ను సిద్ధంచేశామని, జిల్లా స్థాయి నుంచి ప్రతిరోజూ డైలీ రిపోర్టులు, వర్క్ట్లు కేంద్ర కార్యాలయానికి పంపించాలని సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులకు సూచించారు.