హిందూ ధర్మంపై వైయ‌స్ఆర్‌సీపీ డాక్యుమెంటరీ 

తాడేపల్లి : హిందూ ధర్మంపై వైయ‌స్ఆర్‌సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రధానంగా తిరుమల లడ్డూ అంశంతో పాటు మరిన్ని బురదజల్లే కార్యక్రమాలతో ఏడుకొండలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తున్న నేపథ్యంలో గోవిందుడు పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది  వైయ‌స్ఆర్‌సీపీ. గతంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ జీవోలు తెస్తే..  దానిపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా బురదజల్లారు. హిందూ ధర్మం కోసం మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిబద్ధతతో పని చేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశారు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. వీటిన్నింటిపైనా వైయ‌స్ఆర్‌సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది. ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుందని, భక్తి ముసుగులో  ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా చంద్రబాబు?’ అని వైయ‌స్ఆర్‌సీపీ  ఈ  సందర్భంగా ప్రశ్నించింది. ఈ ప్ర‌స్తుతం ఈ డాక్యుమెంట‌రీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు కూట‌మి ప్ర‌భుత్వ తీరును కామెంట్ల రూపంలో ఎండ‌గ‌డుతున్నారు.

Back to Top