మంత్రి అచ్చెన్నాయుడి దిష్టిబొమ్మ ద‌హ‌నం

 మండ‌లి చైర్మ‌న్‌పై మంత్రి వ్యాఖ్య‌ల‌ను నిరసిస్తూ తెనాలిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళ‌న‌

తెనాలి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్‌రాజును అవ‌మానించేలా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడి దిష్టిబొమ్మ‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. శుక్ర‌వారం తెనాలిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో నిరస‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కూటమి ప్రభుత్వం గౌరవించడం లేదని ఆరోపించారు. మండలి చైర్మన్‌పై జరిగిన అవమానకర వ్యాఖ్యలు, చర్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. 
 కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ, ఎస్టీ నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తమ ఆందోళన కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
 

Back to Top