రేపు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

సమకాలీన రాజకీయ అంశాలపై మీడియాతో మాట్లాడనున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత

తాడేపల్లి: రేపు (08.01.2026, గురువారం) ఉదయం 11 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులు వంటి కీలక అంశాలపై వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు. అలాగే ఇటీవలి కాలంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులు, అక్రమ కేసులు, పోలీసుల వ్యవహార శైలి తదితర అంశాలపై కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. 

Back to Top