పదో తరగతి విద్యార్థులకు వైయ‌ జగన్ శుభాకాంక్షలు 

 తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత జగన్ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ… పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొంటూ, పరీక్షలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. తమపై తాము నమ్మకం ఉంచుకుని గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top