టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి

వైయస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా  నిరసనలు 

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ వైయస్ఆర్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులు, మహిళలపై దాడులు జరగడం, అనంతరం వారిపైనే అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలు జిల్లాల్లో నిరసనలు నిర్వహించారు. తిరుపతి నగరంలో నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం కూటమి ప్రభుత్వ అసలు స్వరూపం. మహిళలపై దాడులు చేసి, వారిపైనే కేసులు పెట్టడం అత్యంత దారుణం” అని మండిపడ్డారు. మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు ఇంచార్జి రాజేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి రెడ్డి, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు:
వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు న‌గ‌రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నా జరిగింది. ఈ సంద‌ర్భంగా కాకాణి మాట్లాడుతూ, “మహిళలపై దాడులు చేసి, బాధితులపైనే కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇంచార్జి ఆనం విజయకుమార్ రెడ్డి, మహిళా నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 కర్నూలు: 
క‌ర్నూలు న‌గ‌రంలోని ఎస్‌వీ కాంప్లెక్స్ వద్ద వైయస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో నిరసన కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ, “మహిళలపై దాడులు చేసి, పీడీ యాక్ట్ పెట్టేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని ఖండించడం” అని విమర్శించారు.  కార్యక్రమంలో కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 పశ్చిమగోదావరి (భీమవరం): 

వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో భీమ‌వ‌రంలో నిరసన జరిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ, “శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై దాడులు చేయడం దుర్మార్గం. కేసులను వెంటనే ఎత్తివేయాలి” అన్నారు. కార్యక్రమంలో ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కావూరు శీను, పీవీఎల్ నరసింహారాజు, చిన్నవిల్లి వెంకటరాయుడు, వడ్డీ రఘురాం తదితరులు పాల్గొన్నారు.

 బాపట్ల: 
వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో బాప‌ట్ల‌లో నిరసన జరిగింది. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం” అన్నారు.
కార్యక్రమంలో కోన రఘుపతి, డాక్టర్ అశోక్, వరికూటి అశోక్ బాబు, పీట మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 విజయనగరం: 
విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని బాలాజీ జంక్షన్ వద్ద వైయస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో నిరసన జరిగింది. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, జెడ్పీ చైర్మ‌న్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం దురదృష్టకరం. బీఆర్ నాయుడు వెంటనే తప్పుకోవాలి” అన్నారు. కార్య‌క్ర‌మంలో కోలగట్ల వీరభద్ర స్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

 శ్రీకాకుళం: 
శ్రీకాకుళం న‌గ‌రంలోని అంబేద్క‌ర్‌ జంక్షన్ వద్ద వైయస్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, “మహిళలపై దాడులు చేయించడం, తర్వాత కేసులు పెట్టడం అమానుషం” అన్నారు. కార్య‌క్ర‌మంలో ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, పిన్నింటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా:
విజయవాడ న‌గ‌రంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైయస్ఆర్‌సీపీ నిరసన జరిగింది. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, “ఎస్సీ, ఎస్టీ చట్టాలను రాజకీయంగా వాడుకోవడం తగదు” అన్నారు.
ఈ కార్యక్రమంలో తోలేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 గుంటూరు: 
గుంటూరు న‌గ‌రంలోని లాడ్జి సెంటర్ వద్ద వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జిల్లా అధ్య‌క్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, “మహిళలపై అక్రమంగా కేసులు నమోదు చేయడం అత్యంత దారుణం. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి” అన్నారు. కార్య‌క్ర‌మంలో న‌గ‌ర అధ్య‌క్షురాలు
నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, డైమండ్ బాబు పాల్గొన్నారు.

 చిత్తూరు: 
చిత్తూరు న‌గ‌రంలోని దర్గా సర్కిల్ వద్ద వైయస్ఆర్‌సీపీ నిరసన జరిగింది.  చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ ఎం.సి. విజయానంద రెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వం తప్పుడు కేసులతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులను వేధిస్తోంది” అన్నారు.

కాకినాడ:
కాకినాడ న‌గ‌రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ, “తిరుమల పవిత్రతను కాపాడేందుకు బీఆర్ నాయుడు తొలగింపు తప్పనిసరి” అన్నారు. దాడిశెట్టి రాజా, వంగా గీతా, తోట నరసింహం, దవులూరి దొరబాబు పాల్గొన్నారు.

అనంతపురం: 
న‌గ‌రంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జిల్లా అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ, “మహిళలపై దాడులు చేసి కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అన్నారు.

అమలాపురం
కొనసీమ జిల్లాలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు చీర్ల జ‌గ్గిరెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌ ర్యాలీ నిర్వహించారు.
ఈ సంద‌ర్భంగా జ‌గ్గిరెడ్డి మాట్లాడుతూ, “బాధిత మహిళలకు న్యాయం చేయాలి, కేసులను ఎత్తివేయాలి” అన్నారు.
తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇశ్రాయేల్, జక్కంపూడి విజయలక్ష్మి, పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 అనకాపల్లి: 
అన‌కాప‌ల్లిలో వైయస్ఆర్‌సీపీ నాయ‌కుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..“మహిళలపై కేసులు, అరెస్టులు వెంటనే ఉపసంహరించాలి” అన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, భీశెట్టి సత్యవతి, మనసాల కుమార్ రాజా, ఈర్లె అనురాధ తదితరులు పాల్గొన్నారు.

 కదిరి: 
బీఆర్ నాయుడు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ ఎస్. నిసార్ అహమద్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, “శాంతియుత నిరసన హక్కును అణచివేయడం రాజ్యాంగ విరుద్ధం” అన్నారు. 
 

Back to Top