‘జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంటే చూస్తూ ఊరుకోం’

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి  స్ప‌ష్టం

వైయస్.జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కాని అలా జరగలేదు

విజయమ్మ లేఖ అత్యంత అన్యాయం

తాజా లేఖ ద్వారా విజయ్మ తాను ఒకవైపే ఉంటానని మరోసారి స్పష్టంచేశారు 

ప్రజలను నమ్మించడానికే నోటరీపై లేఖ

టీడీపీ సోషల్‌మీడియా గ్రూపుల్లో ముందస్తుగా లేఖ

విజయమ్మపై షర్మిల ఒత్తిడి సుస్పష్టం

కుమారుడి గౌరవాన్ని విజయమ్మ దెబ్బతీస్తున్నారు

వైయస్‌.జగన్‌ వ్యక్తిత్వ హననం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం

జగన్‌ కోసం విజయమ్మ పడాల్సిన ఆరాటాన్ని మేం పడుతున్నాం

షర్మిలమ్మ కోసం వైయస్.జగన్ ని దిగజార్చే ప్రయత్నం 

షర్మిల వాదనను నిలబెట్టేందుకే ఈ లేఖలు

దానికోసం కుమారుడ్ని పూర్తి అన్యాయస్తుడిగా చూపే ప్రయత్నం

జగన్‌ను జైల్లోపెట్టిన కాంగ్రెస్‌లోకి షర్మిల వెళ్తుంటే విజయమ్మ ఎందుకు అడ్డుకోలేదు

అలాంటి పార్టీకి ఓటేయమని అమెరికా నుంచి వీడియో విడుదల చేస్తారా?

ఎన్ని అంటున్నా జగన్ భరిస్తున్నాడు, ఇప్పటికీ మౌనంగానే ఉన్నాడు

స‌రస్వతి షేర్ల బదలాయింపు చట్ట విరుద్ధం

అటాచ్‌మెంట్లో ఉన్నా షేర్లు బదలాయిస్తారా?

అయినా షర్మిల ఒత్తిడితో సంతకాలు పెట్టారు

కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యం ఎందుకు? 

షర్మిలమ్మకు ఆస్తి రావాలి, జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?

గొడవకు ఆజ్యం పోసిందే షర్మిలమ్మ

చంద్రబాబుతో కలిసి కుట్రలో భాగస్వామి అయ్యారు

2009లో వైయస్.రాజశేఖర రెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం 

ఆ తర్వాత ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి కంపెనీలు వారివి

రాజశేఖరరెడ్డి మరణించి 10 ఏళ్ల తర్వాత కూడా జగన్‌ రూ.236 కోట్లు ఇచ్చారు. 

షర్మిలమ్మ వ్యతిరేక ప్రవర్తన, ప్రతిష్టను దెబ్బతీస్తున్నందునే ఎంఓయూరద్దు

విజయ్మగారి వాదన  ప్రకారమే చంద్రబాబు తన ఆస్తుల్లో వాటాలను  అక్కచెళ్లెల్లకు ఇస్తాడా?

జగన్‌మీద చెళ్లెళ్ల పగ

మా సహనం చచ్చి, మేము మాట్లాడుతున్నాం

వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసిన ప్రతిసారి అందరం మాట్లాడుతాం

రాష్ట్రంలో ప్రతి తల్లి “జగన్ లాంటి కొడుకు నాకు పుట్టాలి” అని అంటోంది.

అన్నకు వ్యతిరేకంగా శత్రువుతో చేతులు కలపడం తప్పు

అన్న ప్రేమతో ఆస్తి ఇస్తే తీసుకోండి

ఇప్పటికే ఎన్‌సీఎల్టీ జగన్‌వైపే తీర్పు ఇచ్చింది

అయినా అప్పిల్‌కు వెళ్లారు, ఆ తీర్పు అయినా వచ్చేంతవరకూ ఆగండి

ప్రొద్దుటూరు:     వైయస్.జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కాని అలా జరగలేదని ప్రొద్దుటూరు వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తాజా లేఖ ద్వారా విజయ్మ తాను ఒకవైపే ఉంటానని మరోసారి స్పస్టంచేశారన్నారు. తన స్టేట్‌మెంట్‌కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక,  షర్మిలకు అన్యాయం చేస్తున్నారనే వాదనను నమ్మించే ప్రయత్నం, వ్యూహం ఉందన్నారు. వైయస్సార్‌ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదలచేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో మొదట కనిపించని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నది తేలిపోయిందన్నారు. విజయమ్మమీద షర్మిల  ఎంత ఒత్తిడి తెస్తున్నారనే విషయం కూడా అర్థమైందన్నారు. 
•    విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి వైయస్.జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. తన మాటలు ఎవరైనా నమ్మితే.. వైయస్.జగన్ ఇంత అన్యాయస్తుడా అని భావించరా? అని ప్రశ్నించారు. షర్మిలమ్మను రక్షించే ప్రయత్నంలో  కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతీస్తున్నారన్నారు. 

•    వైయస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యామన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడు కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్‌గారిని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిలమ్మ కోసం వైయస్.జగన్ ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిలమ్మ, వైయస్.జగన్ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటినీ కూడా గాయపర్చే పని చేయబోమని, కాని జగన్‌పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు.  

రాచమల్లు ఇంకా ఏమన్నారంటే..

•    నా జీవితంలో వైయస్ఆర్‌ కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తోందని అనుకోలేదు. నా తల్లిని గౌరవించినంతగా మిమ్నల్ని కూడా గౌరవిస్తాం. అంతకంటే ముందు ధర్మం, న్యాయం, ఆత్మ గౌరవం మాకుంది.. మా నాయకుడి వ్యక్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. మా నాయకుడి కోసం ప్రాణమిస్తానని చెప్పిన వాడ్ని. ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేను. 

•    షర్మిల వాదనను నిలబెట్టేందుకు మీ కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? జగన్‌ను సమాజంలో హీనపరిచేలా ఇలా చేయడం అన్యాయం కదా? 

•    షర్మిలమ్మకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ బయటకు వచ్చి షర్మిలమ్మ తరఫున సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? ఓదార్పు యాత్రకు వెళతానని జగన్ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని ఎలాప్రకటన చేశారు? మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఇంత పక్షపాతం తల్లిగా మీకు తగునా? కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్ భరిస్తున్నాడు, ఇప్పటికీ మౌనంగానే ఉన్నాడు. 
•    సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసీ కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యం ఎందుకు? షర్మిలమ్మకు ఆస్తి రావాలి, జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?

•    అసలు ఈ గొడవకు ఆజ్యం పోసిందే షర్మిలమ్మ. కుటుంబ వ్యవహారం పత్రికల్లో వచ్చేలా చంద్రబాబుకి ఉప్పందించి సహకరించడంతోనే ఈ గొడవ ప్రారంభమైంది. 

•    2009లో వైయస్.రాజశేఖర రెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో కూడా మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిలమ్మ పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబరు 2 లో షర్మిలమ్మకు ఇళ్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ ఆర్ ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 మెగావాట్లు ఇచ్చారంటే ఈ లేఖలో విజయమ్మే అంగీకరించారు. విజయవాడ యువరాజ్ సినిమా ధియేటర్ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100 శాతం ఇచ్చారంటే దాన్ని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు. ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? 

•    మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే వైయస.జగన్ కు కూడా ఇచ్చారని చెప్పారు. మేం కూడా అదే మాట చెప్పాం. వైయస్.జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే  పెరిగిన వాడు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా వైయస్.జగన్ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. రాజశేఖరరెడ్డి మరణించి 10 ఏళ్ల తర్వాత కూడా వైయస్‌.జగన్‌ రూ.236 కోట్లు ఇచ్చాడు. 

•    2009లో వైయస్ఆర్ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు.   2019 ఆగష్టులో వైయస్.జగన్ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశాడు. ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్ మెంట్ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. 

•    ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైయస్.జగన్ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు వైయస్.జగన్ తన పట్ల షర్మిలమ్మ ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున  తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.

•    సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లను వైయస్.జగన్ విజయమ్మకు ఇస్తే.. ఆటాచ్ మెంట్ లో ఉన్న అస్తులను బదలాయింపు చేస్తే వైయస్.జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న కోర్టు ఆదేశాలున్నాయని తెలిసినా వాటిని బేఖాతర్‌ చేశారు. ఒరిజినల్‌ షేర్‌ సర్టిఫికెట్లు వైయస్.జగన్‌ దగ్గర ఉన్నాయని  తెలిసి ఆవి పోయాయని తప్పుడు అఫడవిట్‌ ఇచ్చి బదాలాయింపు చేసుకున్నారు. అంటే వైయస్.జగన్ జైలుకు పోవాలి, ఆస్తి నాకు రావాలన్నదే షర్మిలమ్  ఉద్దేశం. ఇది జరిగిన తర్వాతనే  వైయస్.జగన్ ఎంఓయూ రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాతనే జగన్‌ నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లా ని ఆశ్రయించాడు. అక్కడ ఆయన కేసు గెలిచారు. ఆ తర్వాత ఇటీవల చెన్నైలో అప్పీలు చేశారు. మీరు అప్పీలు చేసిన గంటలోనే ఆ కాగితాలు చంద్రబాబు దగ్గరకు వెళ్లాయి.

•    2009 తర్వాత ఎవరి వ్యాపారాలు వారివి. తప్పుడు కేసుల్లో జగన్‌ను ముద్దాయిని చేశారు. కేవలం జగన్‌ ఆస్తులను మాత్రము అటాచ్‌ చేశారు. షర్మిలకు ఇచ్చిన ఆస్తులకు అటాచ్‌మెంట్ లేదు. దాని అర్థం ఏంటి? ఆస్తి రెండు భాగాలైనట్లే కదా? 

•    విజయ్మగారి వాదన  ప్రకారం చూస్తే చంద్రబాబు అక్కచెల్లెల్లు రాజేశ్వరి, హైమావతికి ఆయన సంపాదించిన ఆస్తుల్లో సగభాగం పంపకాలు చేశారా? లోకేష్ ఇచ్చారా?
 
•    జగన్ మీద కాంగ్రెస్, టీడీపీ, ఢిల్లీలో ఉన్న పెద్దలు పగబట్టారు. ఇప్పుడు చెల్లెల్లు పగ పట్టారు. చివరకు అమ్మ నుంచి ఆదరణ కూడా కరువైంది. ప్రజలు, మేము, పైన ఉన్న దేవుడు తప్ప అందరూ జగన్‌కు అండగా ఉంటారు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడి న్యాయమే న్యాయం అని విజయమ్మ తన ప్రకటనలో పేర్కొన్నారు. మేము కూడా అదే చెబుతున్నాం.

•    ఇప్పటికీ కూడా మాతో ఆయన మాట్లాడించడం లేదు. చివరకు మా సహనం చచ్చి, మా ప్రేమ పుట్టి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన ఖండన ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. అన్న అనే పదానికి జగన్ కళంకం అన్న మాటలు మాకు బాధ కలిగించాయి. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసిన ప్రతిసారి అందరం మాట్లాడుతాం.

•    విజయమ్మను వినయపూర్వకంగా చేతులు జోడించి అడుగుతున్నాను. మా నాయకుడి మాతృమూర్తి గురించి నిటారుగా నిలబడి కూడా మాట్లాడే అర్హత నాకు లేదు. మీరంటే నాకు గౌరవం, అభిమానం. కాని మీరు రాసిన లేఖను చూసి చంద్రబాబు ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు. అసలైన ఉగాది ఈ రోజే వాళ్లకు.

•    విజయమ్మకు తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. వైయస్ జగన్‌కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైయస్‌ఆర్ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి. 

•    విశాఖ ఎయిర్‌పోర్టులో షర్మిల మాట్లాడుతూ “అన్న అనే పదానికి జగన్ కళంకం” అన్నారు. రాష్ట్రంలో ప్రతి తల్లి “జగన్ లాంటి కొడుకు నాకు పుట్టాలి” అని అంటోంది. ఇది సత్యం. విజయమ్మ, షర్మిలమ్మను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను – అన్నకు వ్యతిరేకంగా శత్రువుతో చేతులు కలపడం తప్పు. అన్న ప్రేమతో ఆస్తి ఇస్తే తీసుకోండి.

•    సునితమ్మ ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికి తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారి ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిలమ్మ ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్‌ను మాత్రం టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.

•    సమాజ ధర్మం ప్రకారం అయినా, లేక న్యాయస్థానానికి వెళ్లినా వైయస్ జగన్ కూడా ఎన్‌సీఎల్‌టికి వెళ్లి గెలిచారు. సమాజ ధర్మం ప్రకారం తల్లిగా ఇద్దరిని కూర్చోబెట్టి, షర్మిలను విజయమ్మే కట్టడి చేయాలి. తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలి. న్యాయస్థానంపై నమ్మకం ఉంటే ప్రెస్ ముందు రావద్దు. మీడియా ముందు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే రాచమల్లు లాంటి అభిమానులు ప్రతి రోజు మీ వ్యాఖ్యలను ఖండించేందుకు సిద్ధంగా ఉంటారు.

•    చివరిగా, తల్లితో సమానమైన విజయమ్మను క్షమించమని కోరుతున్నాను. ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంటే భరించలేక, గుండెను రాయి చేసుకొని ఇలా మాట్లాడాల్సి వచ్చింది. మళ్లీ మీరు ప్రెస్ ముందు మాట్లాడితే తప్పనిసరిగా సత్యాన్ని వెలికి తీసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top