రేపు అద్దంకి నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ సమావేశం 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధ‌వారం (25.03.2026) ఉదయం 11 గంటలకు ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు అధ్యక్షత వహించనున్నారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Back to Top