తాడేపల్లి: పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలతో టెలి కాన్ఫరెన్స్ వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, పార్లమెంటు పరిశీలకులు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై పార్టీ శ్రేణులంతా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించేస్తున్నారని, మన పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా ముందే జాగ్రత్త వహించి సిద్ధం కావాలన్నారు. డిజిటలైజేషన్ పై ఫోకస్ పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే... "పార్టీ కమిటీల నియామకం గురించి, ఐడీ కార్డుల ప్రింటింగ్, కంప్యూటరైజ్ చేయడం, పార్టీ టోటల్ నెట్వర్క్ బిల్డ్ చేయడం, స్ట్రీమ్ లైన్ గురించి అధినేత జగన్ గారు రివ్యూ చేశారు. ఎస్ఐఆర్ మీద, పార్టీ కార్యక్రమాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులతో సమీక్షించారు. ఎస్ఐఆర్ పై దృష్టిపెట్టాలి వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఇది చాలా కీలకం. తమిళనాడులో ఏకంగా కోటీ 40 లక్షల ఓట్ల వరకు తీసేశారని వార్తల్లో చూస్తున్నాం. పశ్చమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లోనూ 40 లక్షలు, 50 లక్షల వరకు తీసేశారని తెలుస్తోంది. ఈ ఎస్ఐఆర్ రాకముందు కూడా మన రాష్ట్రంలో లక్షల ఓట్లు తీసేశారు. 2019లో జగన్ గారు గట్టిగా పోరాడితే కొంత వరకు తగ్గారు. ఇప్పుడు ఎస్ఐఆర్ కు అందరూ తయారు కావాలి. గ్రామాల్లో మీటింగులు పెట్టుకుని చర్చించాలి. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు బిల్డ్ చేసుకోవాలి. ప్రతి బూత్ కూ కచ్చితంగా యాక్టివ్ గా ఉన్న వారిని సెలెక్ట్ చేయాలి. లేటెస్ట్ లిస్టు పెట్టుకుని దాని ప్రకారం ఆ ఇంట్లో వాళ్లు ఎక్కడున్నారు, బయట ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నారు, అనేది గుర్తించాలి. మన ఓట్లు తీయించే ప్రయత్నం చేస్తారు. అధికారంగా మనం చేయగలిగింది ఏమీ లేకపోయినా, ఓటర్లను గుర్తించడం, మ్యాపింగ్ చేసుకోవడం వెంటనే జరగాలి. బీఎల్ఓ ల ద్వారా మనకు తెలియకుండానే ఫామ్ 6, 7 తెచ్చి పెడతారు. టెక్నఇకల్ గా అవగాహన కలిగి ఉండాలి. అందరితో మాట్లాడాలి. రిటైర్డ్ ఆఫీసర్ గానీ, అనుభవం ఉన్న వారితో మాట్లాడాలి. గతంలో పని చేసిన వారిని సంప్రదించాలి. వారం రోజుల్లో స్క్రీనింగ్ అరేంజ్ చేస్తాం, డిజిటలైజేషన్ వేగంగా జరగాలి జూన్, జూలైనాటికి ఏడాది అవుతోంది. ఇందుకు సంబంధించి జగన్ గారే అందరికీ చెప్పారు. ఫాలో అప్ యాక్షన్ జరుగుతోంది. స్ట్రక్చరింగ్ చేయడం మొదలు పెట్టాం. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ మొదలు పెట్టాం. ట్రైనింగ్ ఇచ్చాం. ఐడీ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ విషయంలో అందరికీ మంచి జరిగేలా జగన్ గారు నిర్ణయం తీసుకుంటారు. కమిటీల్లో వీలైనంత ఎక్కువ మందిని చేర్చాలి కమిటీల నియామకం వేగంగా పూర్తయింది. ఈ కమిటీల్లోకి వీలైనంత ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలన్నది వైఎస్ జగన్ గారి ఆలోచన. ఆ మేరకు అవసరమైతే కమిటీలు పెంచుకోవచ్చు. క్రియాశీలకంగా ఉన్న చోట, బలం ఉన్న చోట వీలైనంత ఎక్కువ మందిని తీసుకోవాలి. అప్పుడే మనం బలంగా తయారవుతాం. ఎన్నికలు వచ్చేసరికి బలమైన నెట్వర్క్ తయారవుతుంది. పార్లమెంటు పరిశీలకులు క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం తయారు చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. సెంట్రల్ ఆఫీసుకు, మీకు సమన్వయం చేస్తూ సెక్రటరీలు పని చేస్తారు. ఇబ్బందులు ఏవైనా ఉంటే వారితో మాట్లాడి షార్ట్ అవుట్ చేసుకోవాలి. పార్లమెంటు పరిశీలకులు తమ బాధ్యత కచ్చితంగా నిర్వర్తించాలి. 12 లక్షలకు పైగా డిజిటలైజేషన్ లక్ష్యంగా పెట్టుకున్నాం. వెరిఫికేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఇందుకోసం పేరు, ఫొటోలు ఇచ్చే ప్రక్రియ వేగంగా జరగడం లేదు. దీనిపై దృష్టిపెట్టాలి. ఐడీ కార్డుల ప్రింటింగ్ ఇప్పుడే మొదలైంది. విజిబులిటీ మీడియా ప్రెజెన్స్ మీడియాలో ప్రెజెన్స్ ఉండేలా చూసుకోవాలి. కచ్చితంగా మీరు కోఆర్డినేటర్ గా ఇష్యూస్ మీద రియాక్ట్ కావడం, స్థానిక సమస్యల మీద అధికార పార్టీ ఎమ్మెల్యేల అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం, అవినీతిపై పిన్ పాయింట్ చేస్తూ కంటిన్యూగా రెస్పాన్స్ ఉండాలి. అవి మీడియాలో వచ్చేలా చూసుకోవాలి. స్థానిక పత్రికలు, సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చేలా చూసుకోవాలి. స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న వారి విషయాలను ఎత్తి చూపడం చేయాలి. నెలకు మూడు నాలుగు ప్రెస్ కాన్ఫరెన్సులు కచ్చితంగా పెట్టాలి. ఇది కచ్చితంగా జరగాలని అధినేత ఆదేశించారు. టీటీడీ చైర్మన్, డ్రగ్స్ ఇష్యూపై కొనసాగించాలి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కళంకితుడైనా పదవిలో కొనసాగించడంపై వదలొద్దు. నిన్న కూడా ఏమీ జరగనట్టు చంద్రబాబు తిరుమలలో బీఆర్ నాయుడును పక్కనపెట్టుకుని నటించారు. ఇలాంటి వాటిపై పార్టీ శ్రేణులు సిరియస్ గా తీసుకోవాలి. డ్రగ్స్ ఇష్యూపై కూడా ఎలాంటి చర్యల్లేవు. నాలుగు రోజులు సైలెట్ గా ఉంటే సరిపోతుందనుకుంటున్నారు. వీటిపై బలంగా నిలదీద్దాం. మొత్తంగా కమిటీల నియామకం, ఎస్ఐఆర్, పార్టీ పరిశీలకులు, అసెంబ్లీ పరిశీలకులతో కోఆర్డినేషన్ వేగంగా జరగాలి. పార్టీ కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. రేపు గ్రేటర్ రాయలసీమ వారితో మీటింగ్ పెట్టుకుంటున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇష్యూతో పాటు మిగిలిన సమస్యలను చర్చిద్దాం. ఆల్మట్టి హైట్ పెంచుతున్నారు. చంద్రబాబు కేంద్రంలో భాగస్వామి అయ్యి ఉండి కూడా ఆపే పరయత్నం చేయడం లేదు. పోలవరం ఎత్తు కుదిస్తున్నారు. ఇవన్నీ మనం టేకప్ చేయాలి. అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.