దేశం సుధాకర్ రెడ్డిని పరామర్శించిన బుగ్గన 

నంద్యాల: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, నంద్యాల సీనియర్ నాయకుడు దేశం సుధాకర్ రెడ్డి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనను వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డిలు శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి దేశం సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బుగ్గ‌న‌ మాట్లాడుతూ, పార్టీకి ఎంతో కాలంగా సేవలందిస్తున్న దేశం సుధాకర్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకున్నారు.

Back to Top