నేడు ఒంగోలు నియోజకవర్గ నేతలతో వైయ‌స్ జగన్ కీలక సమావేశం 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి పార్టీ బలోపేతం, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై చర్చ జరగనుంది. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలపర్చడం, కార్యకర్తలతో సమన్వయం పెంచడం వంటి అంశాలపై వైయ‌స్ గన్ మార్గదర్శకత్వం ఇవ్వనున్నారు.

అలాగే స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై నేతల అభిప్రాయాలను తెలుసుకుని, పార్టీని మరింత ప్రజాభిముఖంగా ముందుకు తీసుకెళ్లే దిశగా చర్చలు జరగనున్నాయి.
 

Back to Top