క్రాంతి కుమార్ ఆత్మహత్యపై సర్కార్ మొద్దునిద్ర

పోలీసుల పాత్ర ఉందనే వదిలేస్తున్నారా?

సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు బయటికొస్తాయి

తేల్చిచెప్పిన మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్

విజయవాడలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పేరుపోరు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్

క్రాంతి కుమార్ మరణంపై చర్యలేవీ?

కళ్లు లేని కబోదిలా హోంమంత్రి 

అట్రాసిటీ చట్టాలు ఉన్నది ఎందుకు?

చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే

మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టీకరణ

క్రాంతి కుమార్ వీడియో చూస్తే బాధేస్తోంది 

బాధితుల్ని మరింత క్షోభపెట్టేలా పవన్ మాటలు

ఇది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యే

క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ 

విజయవాడ: దళిత నాయకుడు పేరు పోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకూ చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని, పోలీసుల పాత్ర ఉన్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇవాళ విజయవాడలోని క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యుల్ని వైఎస్సార్సీపీ నేతలతో కలిసి మాజీ మంత్రులు పరామర్శించారు. దళితుడైన క్రాంతి కుమార్ వీడియోలో స్పష్టంగా తన మరణానికి కారకులెవరో చెప్పినా ఇంకా అట్రాసిటీ కేసులు పెట్టి బాధ్యుల్ని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే వైఎస్సార్సీపీ తరఫున పోరాటాలు తప్పవని మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. 

క్రాంతి కుమార్ మరణంపై చర్యలేవీ ?:
మేరుగ నాగార్జున, మాజీ మంత్రి 

దళిత నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ చనిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. అనేక మంది కోసం ఉద్యమాలు చేసిన నాయకుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం, అదీ వ్యవస్థలు కాపాడే పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పి మరీ చనిపోవడం దారుణం. నాలుగు నెలలుగా పోలీసులు వేధిస్తూ, నీ కుమారుడిని అంతం చేస్తామని తల్లితో కూడా చెప్తుంటే క్రాంతి కుమార్ గుళికలు తిని చనిపోయాడు. తాను చనిపోవడానికి ఫలానా పోలీసు అధికారే కారణమని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే పోలీసుల పాత్ర ఉందని వదిలేస్తారా ? క్రాంతి కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియోపై హోంమంత్రి ఇప్పటివరకూ స్వయంగా దళితురాలైన హోంమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు ? కళ్లు లేని కబోదుల్లా ఎందుకు చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారు?, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేయలేదో చెప్పండి? ఎందుకు మా చట్టాల్ని చుట్టాలుగా మార్చుకుని ఎందుకు అపహాస్యం చేస్తున్నారు ? అందుకే ఈ చావుపై అట్రాసిటీ కేసు పెట్టడంతో పాటు సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాల్సిందే. క్రాంతి కుమార్ ఏ పార్టీ అయినా, సాయికృష్ణ ఏ పార్టీ అయినా వారి చావులకు న్యాయం జరగాల్సిందే. మాకు పార్టీలు లేవు. బాధితులందరూ ఒకటే. ఇంకా విజయవాడ సీపీ ఎందుకు కేసు నమోదు చేయకుండా వేచి చూస్తున్నారో చెప్పాలి.  ఏపీలో చట్టాలు అపహాస్యం అవుతున్నాయి, బాధితులకు న్యాయం జరగడం లేదని ఎన్సీఆర్బీ రికార్డులే చెప్తున్నాయి. మా క్రాంతి కుమార్ కు ఓ న్యాయం, మీకు మరో న్యాయమా చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. క్రాంతి కుమార్ చావుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. 

ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యే:
వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి

ఎస్సీ ఉద్యమాలతో పాటు అనేక సామాజిక ఉద్యమాల్లో పేరుపోగు వెంకటేశ్వరరావు. వారి కుమారుడు క్రాంతి కుమార్ ఏ విధంగా చనిపోయాడో అతని సెల్ఫీ వీడియో చూస్తేనే అర్దమవుతోంది. అందుకే వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాం. క్రాంతి కుమార్ తండ్రితో పాటు పిల్లల్ని కూడా ఇవాళ పరామర్శించాం. ఆ వీడియోలో పోలీసు వేధింపులే కాదు ఎస్సీల్లో పుట్టడం వల్లే తనకు ఇలా జరుగుతోందని చెప్పిన మాటలు వింటుంటే బాధేస్తోంది. ఆ సెల్ఫీ వీడియో చూసి అయినా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులకు బాధ కలగడం లేదా ? రౌడీ షీటర్లని ముద్రలు వేసేది మీరే, వాళ్లను చంపేస్తోందీ మీరే. టీడీపీలో రౌడీ షీటర్లు లేరా ? గతంలో చిన్న చిన్న పొరబాట్లు చేసినా, ఇవాళ కుటుంబం కోసం బతుకుతుంటే వారి చావుకు ఈ ప్రభుత్వం కారణమైంది. కాబట్టి ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ బాధిత కుటుంబాల్ని మరింత క్షోభపెట్టేలా మాట్లాడుతున్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, తాను హోంమంత్రిగా ఉంటే ఏదో చేసే వాడినని ఇలాంటి సందర్భంలో మాట్లాడతారా ? దళిత హోంమంత్రికి క్రాంతి కుమార్ చావుపై మాట్లాడేందుకు మనసు రాదా ? మీ విషయంలో మాత్రమే అట్రాసిటీ కేసులు గుర్తుకొస్తాయా ? క్రాంతి కుమార్ వీడియో రిలీజ్ అయి వారం రోజులు కావస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటే మీరెంత దారుణంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ కేసులో తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ కట్టామని చెప్తున్న మీరు ఎవరిని అరెస్టు చేశారో చెప్పాలి. ఎస్సీ సంఘాలు పోలీసు కమిషనర్ ను ఇవాళ కలిశారు. ఇలా ఎన్నిసార్లు మీకు చర్యల కోసం బతిమాలుకోవాలి. ఎస్సీ వర్గాలంటే మీకెందుకు ఇంత చులకనా?, చంద్రబాబు పెద్ద తప్పు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇటువైపు వెళ్తూ కూడా క్రాంతి కుమార్ కుటుంబ పరామర్శకు ఎందుకు రాలేకపోతున్నారో చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు క్రాంతి కుమార్ చావుకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం ఇవ్వాలి. లేకపోతే వైఎస్సార్సీపీ వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.

Back to Top